Advertisementt

భారీ అంటే భయపడేలా చేశారుగా..?

Sat 12th Oct 2019 08:54 AM
sye raa,saaho,bollywood,north,overseas,fear,chiranjeevi,mahesh,ram charan,jr ntr,prabhas  భారీ అంటే భయపడేలా చేశారుగా..?
Sye Raa and Saaho Disappoints Tollywood భారీ అంటే భయపడేలా చేశారుగా..?
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత చాలామంది హీరోల కన్ను పాన్ ఇండియా మూవీస్ మీద పడింది. బాహుబలిలా నాలుగైదు భాషల్లో సినిమాని విడుదల చేసి హిట్ కొట్టాలనే కసితో ప్రభాస్ సాహో చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక చిరంజీవి సైరా తో హిట్ అంటున్నాడు కానీ.... హిందీ, ఓవర్సీస్ పరిస్థితి చూస్తే సైరా నరసింహారెడ్డి పరిస్థితి డౌట్ కొడుతోంది. ఇక సాహో సినిమా ట్రైలర్‌లో యాక్షన్ చూసాక అల్లు అర్జున్ కూడా తన ఐకాన్ సినిమాలో యాక్షన్ ఉండాలని కోరుకోవడమే కాదు... సినిమాకి భారీ బడ్జెట్ పెట్టాలని చూశాడు. సాహో ఫలితం వచ్చాక అల్లు అర్జున్ భారీ బడ్జెట్ ఆలోచన విరమించుకున్నాడు.

ఇక మహేష్ బాబు మాత్రం కేవలం తెలుగు తమిళాన్నే టార్గెట్ చేస్తున్నాడు కానీ.. పాన్ ఇండియా ఆలోచన చెయ్యడం లేదన్నారు. కానీ ప్రభాస్, చిరుని చూసాక మహేష్ అలాంటి ఆలోచన చెయ్యడనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఇప్పుడు పాన్ ఇండియా మూవీ RRR‌లో నటిస్తున్నారు కానీ... వారు సాహో, సైరా చూసాక ఆ ఆలోచన విరమించుకునేవారే. కానీ రాజమౌళి వెనుక ఉన్నాడనే ధైర్యం వారిలో ఉంది. ఆ సినిమా సంగతి పక్కన పెడితే సాహో, సైరాల తర్వాత భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టాలీవుడ్ హీరోలేమైనా తగ్గుతారో.. లేదంటే.. ఇదే మా రూట్ అంటారో.. చూద్దాం.

Sye Raa and Saaho Disappoints Tollywood:

Sye Raa and Saaho Movie Failed at Bollywood and Overseas Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ