ప్రముఖ నటి ఈషా రెబ్బా తన కెరీర్లో తొలిసారి రాగల 24 గంటల్లో అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్, తమిళ నటుడు శ్రీరామ్, ముస్కాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన స్టిల్ లో సంప్రదాయమైన లుక్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు ఈషా రెబ్బా. కెరీర్ లోనే ఈషా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చారని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల నుంచి ఈమెకు అద్భుతమైన స్పందన వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. రఘు కుంచె రాగల 24 గంటల్లో సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శ్రీ నవహాస్ క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ రాగల 24 గంటల్లో సినిమాను సమర్పిస్తోంది.
నటీనటులు:
ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీనివాస్ రెడ్డి
నిర్మాత: శ్రీనివాస్ కానూరు
బ్యానర్: శ్రీ నవహాస్ క్రియేషన్స్
సంగీతం: రఘు కుంచె
సినిమాటోగ్రాఫర్: గరుడవేగా అంజి
ఎడిటర్: తమ్మి రాజు
లిరిక్స్: భాస్కరభట్ల, శ్రీమణి