Advertisementt

ఫ్యాన్స్‌కు షేక్ హ్యాండిచ్చాక డెటాల్‌తో క్లీనింగ్

Sat 12th Oct 2019 11:33 PM
controversial director,samy,vijay,kollywood  ఫ్యాన్స్‌కు షేక్ హ్యాండిచ్చాక డెటాల్‌తో క్లీనింగ్
Controversial director Samy slams actor Vijay ఫ్యాన్స్‌కు షేక్ హ్యాండిచ్చాక డెటాల్‌తో క్లీనింగ్
Advertisement
Ads by CJ

తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత బాగా పేరున్న.. ఎక్కువగా వినపడే పేరు ఇలయదళపతి విజయ్. రజనీ తర్వాత ఈయనకే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నదీ తెలిసిందే. ఒక్క తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విజయ్‌కు కోట్లాదిగా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఈయన ఎంచుకునే సినిమా కథలు కానీ.. నటన అలా ఉంటుంది మరి. అందుకే విజయ్‌ను ‘అందరివాడు’గా తంబీలు పిలుస్తుంటారు.

ఇంతవరకూ అంతా ఓకేగానీ తాజాగా డైరెక్టర్ సామి.. విజయ్‌పై చేసిన ఆరోపణలు అందర్నీ ఆలోచింపచేస్తున్నాయ్.. తమిళ తంబీలే కాదు.. విజయ్ వీరాభిమానులు ఆలోచనలో పడ్డారు. అసలు ఇందులో నిజానిజాలెంతున్నాయో తెలియట్లేదు కానీ.. సామి వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానుల్లో కలవరం మొదలయ్యేలా చేశాయి.

అసలేంటి వివాదం!

‘అభిమానులపై విజయ్ దొంగ ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమ నాలుకపై తప్ప హార్ట్‌లో ఉండదు. అభిమానులకు (ఫ్యాన్స్‌కు) షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత డెట్టాల్‌తో విజయ్ తన చెయ్యిని కడుక్కుంటాడు. అది నిజమైన ప్రేమ కానే కాదు. బాక్సాఫీస్ లెక్కల కోసమే విజయ్ అలా ప్రేమను కురిపిస్తుంటాడు. ఇలాంటి దొంగ ప్రేమను అభిమానులెవరూ నమ్మొద్దు. విజయ్ అభిమానులకు ఫేవరిజం తగ్గాలి’ అని సామి ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. అయితే సదరు డైరెక్టర్ ఎందుకిలా ఆరోపణలు చేశాడు..? వీరిద్దరి మధ్య ఏమైన వైరం ఉందా లేకుంటే పనిగట్టుకుని ఇలా చేస్తున్నాడా..? అనేది మాత్రం తెలియరాలేదు.

Controversial director Samy slams actor Vijay:

  Controversial director Samy slams actor Vijay

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ