Advertisementt

నా దృష్టిలో కమల్ గొప్ప నటుడు కాదు: తేజ

Thu 17th Oct 2019 02:01 PM
director teja,mayukha talkies,sensational comments,kamal haasan,rajinikanth,chiru,big b  నా దృష్టిలో కమల్ గొప్ప నటుడు కాదు: తేజ
Director Teja Sensational Comments on Kamal Haasan నా దృష్టిలో కమల్ గొప్ప నటుడు కాదు: తేజ
Advertisement
Ads by CJ

డైరెక్టర్ తేజ మరోసారి హీరోస్‌పై విరుచుకుపడ్డాడు. ఉన్నదీ ఉన్నట్టు, ముక్కు సూటిగా మాట్లాడే తేజ లేటెస్ట్‌గా కమల్ హాసన్, రజినీకాంత్ మధ్య తేడా ఏంటో చెప్పాడు. తన దృష్టిలో కమల్ హాసన్ మహానటుడు కాదని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘‘చాలా మంది.. కమల్ హాసన్ గొప్ప నటుడు అనుకుంటారు. కానీ నా ఉద్ధేశ్యం ప్రకారం ఆయన గొప్ప నటుడు కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉదాహరణకు కమల్ హాసన్ దశావతారంలో 10 గెటప్స్ వేశాడు. బాగా చేసాడు అని అంతా అనుకున్నారు కానీ ఆ గెటప్స్ లో కమల్ హాసనే కనిపించాడు ఆయన చేసిన పాత్ర కనిపించలేదు. రజినీకాంత్ రోబో సినిమాలో చూస్తే ఓ సీన్ లో సైంటిస్ట్ రజనీని చంపాలని రోబో ప్రయత్నిస్తుంటుంది. రోబోలా మారువేషం వేసుకున్న సైంటిస్ట్‌ను గుర్తుపట్టేస్తుంది. అక్కడ మనం రజినీని చూడం ఆ పాత్రను చూస్తాం. అది నటుడు  గొప్పదనం. నటుడు కనిపించకూడదు తాను చేసే పాత్ర కనిపించాలి. అందుకే రజని అంటే చాలా ఇష్టం’’ అని అన్నారు.

స్టార్స్ ఊరికే అయిపోరు. చాలా కష్టపడితే తప్ప స్టార్స్ అవ్వలేరు. కానీ ఇప్పుడు చాలామంది ఊరికే స్టార్స్ అయిపోతున్నారు. కాకపోతే వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగట్లేదు. నా దృష్టిలో హీరో అనేవాడు కారవాన్‌లో ఉండకూడదు. తన పోర్షన్ లేకపోయినా అక్కడే కూర్చుని మిగిలిన నటీనటులు ఏం చేస్తున్నారో చూడాలి. ఇలా ఇతర నటుల యాక్టింగ్‌ను కూడా గమనిస్తూ సెట్స్‌లో ఉండేవాడే నిజమైన స్టార్ అవుతాడని... అమీర్, అమితాబ్, చిరంజీవి లాంటి నటులు అదే చేస్తున్నారు అని అందుకే వారు స్టార్స్ అయ్యారు అని చెప్పుకొచ్చాడు.

Director Teja Sensational Comments on Kamal Haasan:

Director Teja Speech at Mayukha Talkies Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ