Advertisementt

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అతనేనా?

Thu 17th Oct 2019 09:35 PM
rahul vs varun sandesh,bigg boss,season 3,finalist,telugu bigg boss  బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అతనేనా?
Who is the Bigg Boss Season 3 Winner? బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అతనేనా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 3 ఇక చివరి మూడు వారాలకు చేరుకుంది. హౌస్‌లో 7 గురు కంటెస్టెంస్ట్స్‌లో రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా.. చివరి వారంలో ఐదుగురు ఫైనల్ లో ఉంటారు. అయితే ఈ వారంలో వితిక కానీ, శివ జ్యోతి కానీ, బాబా భాస్కర్ కానీ బయటికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అయితే ఎక్కువగా వితికే ఈ వారం ఎలిమినేట్ అవ్వొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఇక టైటిల్ ఫేవరెట్‌గా శ్రీముఖి, వరుణ్, రాహుల్ ఉండగా...మొదటినుండి రాహుల్‌ని టార్గెట్ చేసిన శ్రీముఖి.. మధ్యలో అతని పవర్ చూసి వెనక్కి తగ్గింది. కానీ మళ్ళి ఎలిమినేషన్ టాస్క్‌లో కావాలని రాహుల్‌ని రెచ్చగొట్టింది. దానితో శ్రీముఖి పై కాస్త నెగెటివ్ ఫీలింగ్స్ ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.

ఫైనల్‌గా టైటిల్ పోరు వరుణ్, రాహుల్ మధ్యనే జరిగే అవకాశం కనబడుతుంది. అయితే వరుణ్ కూడా పోయిన ఎలిమినేషన్ టాస్క్‌లో వితికాను సేవ్ చేసే క్రమంలో మిస్టర్ కూల్‌గా ఉండేవాడు కాస్త... జ్యోతి విషయంలో నోరు పారేసుకున్నాడు. మొదటినుండి హౌస్‌లో జరిగే గొడవలను సర్ది చెబుతూ.. వితికాను కంటెస్టెంట్‌గా చూసే వరుణ్ చివరిలో వితికాను భార్యలా చూడడం అతనిపై నెగిటివ్‌ను క్రియేట్ చేసింది. రాహుల్ కూడా సోలోగా శ్రీముఖి టార్గెట్‌ని అడ్డకుంటూ స్ట్రాంగ్‌గా నిలబడడంతో... ఫైనల్ విన్నర్‌గా రాహుల్ నిలుస్తాడని అతనికి ప్రతి వారం పడే ఓట్ల ద్వారా అర్ధమవుతుంది. సో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ అని ఫిక్స్ అవ్వొచ్చు.

Who is the Bigg Boss Season 3 Winner?:

Bigg Boss Final: Rahul vs Varun Sandesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ