Advertisementt

కృష్ణవంశీకి పరుచూరి బ్రదర్స్ ‘స్క్రిప్ట్’ సాయం!

Thu 24th Oct 2019 02:28 PM
krishna vamsi,paruchuri brothers,natasamrat,rangamarthanda,tollywood  కృష్ణవంశీకి పరుచూరి బ్రదర్స్ ‘స్క్రిప్ట్’ సాయం!
Krishna Vamsi Asking Support From Paruchuri brothers కృష్ణవంశీకి పరుచూరి బ్రదర్స్ ‘స్క్రిప్ట్’ సాయం!
Advertisement
Ads by CJ

క్రియేటివ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో పేరున్న సీనియర్ కృష్ణ వంశీ తెలుగులో ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. గత కొన్నేళ్లుగా ఈయన తీసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ వినూత్న దర్శకుడు ఎక్కడా కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వవాత మళ్లీ తాజా సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. అయితే అది కూడా రీమేక్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా పోస్టర్‌ను కూడా విడుదల చేసేసింది.

ఈ ‘నటసామ్రాట్’ అనే సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి మంచి కథగా తీర్చిదిద్దాలని పరుచూరి బ్రదర్స్‌ను కృష్ణవంశీ కోరాడట. దీంతో రంగంలోకి దిగిన బ్రదర్స్ స్క్రిప్ట్ సాయం చేస్తున్నారట. అయితే.. పరుచూరి బ్రదర్స్ కలం బలం గురించి ప్రత్యేకించి మరీ చెప్పుకోనక్కర్లేదు. దాదాపు ఈ కంపౌండ్ నుంచి కథలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత పరుచూరి బ్రదర్స్‌పై కృష్ణవంశీ బాధ్యతలు పెట్టారట. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తయితే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఇదిలా ఉంటే.. 2016లో మరాఠీలో విజయవంతమైన ‘నటసామ్రాట్’ చిత్రాన్ని తెలుగులో ‘రంగమార్తాండ’ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా దర్శకుడు వెల్లడించలేదు.

Krishna Vamsi Asking Support From Paruchuri brothers:

Krishna Vamsi Asking Support From Paruchuri brothers  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ