Advertisementt

పూరితో సినిమా చేయాలని ఉంది: సల్మాన్

Thu 24th Oct 2019 06:15 PM
salman khan,dabangg 3 movie,puri jagannadh,salman khan hero,trailer release  పూరితో సినిమా చేయాలని ఉంది: సల్మాన్
Dabangg 3 trailer Released పూరితో సినిమా చేయాలని ఉంది: సల్మాన్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ దబాంగ్-3 ట్రైలర్ విడుదల

సల్మాన్ ఖాన్-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం తెలిసిందే..! ఆ సీరీస్‌లో భాగంగా ఇప్పుడు వారిద్దరి క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం దబాంగ్-3. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2లో లేని సరికొత్త అంశాలతో ఈ చిత్రం రూపొందనుంది. సోనాక్షి సిన్హా, సై మంజ్రేకర్ హీరోయిన్స్‌గా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స(SKF) సౌజన్యంతో శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ సమర్పణలో ఆర్బాజ్ ఖాన్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్, ఆర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది దబాంగ్-3 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కిచ్చా సుదీప్ పవర్ ఫుల్ విలన్‌గా నటించారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ చిత్ర ట్రయిలర్‌ని అక్టోబర్ 23న ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై‌లో అభిమానుల సమక్షంలో లైవ్ చాట్లో విడుదల చేశారు. అన్నిచోట్లా పీవీఆర్ థియేటర్స్‌‌లో దబాంగ్-3 ట్రైలర్ విడుదల కావడం విశేషం.

మీడియా సమావేశంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి రైటర్‌ని నేనే.. దబాంగ్ పార్ట్ 1, పార్ట్ 2 కంటే ఈ దబాంగ్ పార్ట్ 3 చిత్రం చాలా బెటర్‌గా కొత్తగా ఉంటుంది. సోనాక్షి సిన్హా, సై మంజ్రేకర్ ఇద్దరు బ్యూటీఫుల్‌గా నటించారు. వారిలో ఎవర్ని లవ్ చేశాననేది సస్పెన్స్. సై మంజ్రేకర్ మొదటి సినిమా అయినా ఎక్కడా టెన్షన్ పడకుండా సింగల్ టేక్‌లో  చేసింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ప్రేక్షకులందరు ఎంజాయ్ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. పూరి జగన్నాధ్ తో సినిమా ఎప్పుడు అన్న ప్రశ్నకు.. నవంబర్ ఫస్ట్ వీక్లో హైదరాబాద్ వస్తాను అప్పుడు ప్రభుదేవా, నేను కలిసి  పూరి జగన్నాధ్‌ని కలుస్తాం.. తప్పకుండా పూరితో సినిమా చేయాలని నాకు ఉంది అన్నారు..’’ అన్నారు.

ఈ చిత్రానికి కథ: సల్మాన్ ఖాన్, స్క్రీన్‌ప్లే: సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, అలోక్ ఉపాధ్యాయ, కెమెరా: మహేష్ లిమాయే, మ్యూజిక్: సాజిద్ వాజిద్, అసోసియేట్ ప్రొడ్యూసర్: షామివాగ్ నంబియార్, ఎడిటర్: రితేష్ సోని, యాక్షన్: అనల్ అరసు, ప్రొడక్షన్ డిజైనర్: వాసిబ్ ఖాన్, కాస్ట్యూమ్ డిజైనర్: ఆశ్లే రెబెల్లో, ఆల్విరా ఖాన్ అగ్నిహోత్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ చతుర్వేది, సౌండ్ డిజైనర్: జితేంద్ర చౌదరి, మాటలు: రాజశ్రీ సుధాకర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్.

Click Here For Trailer

Dabangg 3 trailer Released:

Salman Khan About Dabangg 3 Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ