Advertisementt

ఈసారి చిరు కొత్తింట్లో 1980 బ్యాచ్ హంగామా!

Thu 24th Oct 2019 06:51 PM
1980 batch,chiranjeevi,hungama,reunion,mega star,host,10th meet  ఈసారి చిరు కొత్తింట్లో 1980 బ్యాచ్ హంగామా!
1980 Batch Hungama in Chiranjeevi House ఈసారి చిరు కొత్తింట్లో 1980 బ్యాచ్ హంగామా!
Advertisement
Ads by CJ

1980లో నటించిన సీనియర్ నటులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ లాల్, రాధిక, సుమలత, జయప్రద, జయసుధ, ఖుష్భు లాంటి నటీనటులు చాలామంది గత పదేళ్లుగా ఏదో ఓ మంచి ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుని.. అందరూ కలిసి 1980 బ్యాచ్ హంగామా అంటూ రీ యూనియన్ అయ్యి తెగ హంగామా చేస్తున్న ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అందరు కలిసి ఒకే డ్రెస్ కోడ్ తో ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ తెగ హడావిడి చేస్తున్నారు. గత ఏడాది ఈ సీనియర్ నటులంతా తమ తమ ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. చిరు తన భార్య సురేఖతో కలిసి ఈ పార్టీలో పాల్గొనడానికి చైనా వెళ్ళారు. ఇలా వారంతా కలవడం మొదలుపెట్టి ఈ ఏడాదికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది.

అయితే ఈ రీ యూనియన్ పార్టీ మొదలెట్టి 9 ఏళ్ళు పూర్తి చేసుకుని.. 10 ఏడాదిలోకి అడుగుపెట్టడంతో.. ఈ ఏడాది ఈ 1980 బ్యాచ్ రీ యూనియన్ పార్టీని చిరు స్పెషల్ గా హోస్ట్ చెయ్యబోతున్నాడు. చిరంజీవి ఈమధ్యనే తన ఇంటిని రీ మోడలింగ్ చేయించడంతో.. తన ఇంట్లోనే 1980 బ్యాచ్ రీ యూనియన్ పార్టీ పెట్టబోతున్నట్లుగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. చిరంజీవి ఇంట్లోనే 1980 బ్యాచ్ మొత్తం కలిసి నవంబర్ 23న స్పెషల్ గా పార్టీ చేసుకోబోతున్నట్లుగా చిరు తెలియజేసారు. సో.. 1980 బ్యాచ్ ఈసారి హైదరాబాద్ లో చిరు ఇంట్లోనే ల్యాండ్ అయ్యి ఎంజాయ్ చెయ్యబోతున్నారన్నమాట. 

1980 Batch Hungama in Chiranjeevi House:

1980 Batch Re-union 10th meet Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ