Advertisementt

పొలిటీషియన్ బయోపిక్‌లో పవన్ కల్యాణ్!?

Fri 25th Oct 2019 05:41 PM
pawan kalyan,jaggareddy,mla jaggareddy,politician biopic  పొలిటీషియన్ బయోపిక్‌లో పవన్ కల్యాణ్!?
Will Pawan Acts These Politician Biopic! పొలిటీషియన్ బయోపిక్‌లో పవన్ కల్యాణ్!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ పవర్‌స్టార్ కమ్ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నారా..? ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేయాలని భావిస్తున్నారా..? తనకు ఇష్టమైన పొలిటీషియన్ బయోపిక్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? కీలకనేత, తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడిగా పేరుగాంచిన ఆ నేత పవన్‌ను సంప్రదించే పనిలో నిమగ్నమయ్యారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ బయోపిక్‌ షురూ చేస్తారా..? అంటే ఇవన్నీ ఇంచుమించు నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇంతకీ ఆ పొలిటీషియన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఆయనేనండి.. తెలంగాణ రాజకీయాల్లో పేరుగాంచిన అందరికీ సుపరిచితుడైన కాంగ్రెస్ కీలకనేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఈయన గురించి ప్రత్యేకించి మరీ చెప్పాల్సిన అక్కర్లేదు. కాస్త రాజకీయాల గురించి అవగాహన ఉంటే అస్సలే చెప్పనక్కర్లేదు. మంచి మాస్ లీడర్‌గా పేరుగాంచిన జగ్గారెడ్డితో పవన్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు వీరిద్దరూ కలిశారు కూడా. అంతేకాదు అప్పట్లో జగ్గారెడ్డి.. జనసేన తీర్థం పుచ్చుకుంటారని తెలంగాణ బాధ్యతలు అన్నీ ఆయనకే పవన్ అప్పగిస్తారని కూడా ప్రచారం జరిగింది. 

అయితే రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా.. మాజీగా ఇలా అన్ని పాత్రలు పోషించిన జగ్గారెడ్డికి.. తన బయోపిక్‌ తీసుకోవాలని బాగా ఇంట్రెస్ట్‌తో ఉన్నారు. తన మనసులోని మాటను ఓ ఇంటర్వ్యూ వేదికగా బయటపెట్టారు. అంతేకాదు ఈ బయోపిక్‌లో నటించాలని పవన్‌ను కోరుతానని.. ఆయ‌న అంగీక‌రిస్తార‌నే న‌మ్మకం త‌న‌కుంద‌ని జ‌గ్గారెడ్డి ధీమాగా చెప్పారు. జగ్గారెడ్డి చెబుతున్నారు సరే.. మరి పవన్ ఒప్పుకుంటారా..? లేకుంటే బయోపిక్ కదా అని తీస్తే పోలా అని నటిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఏదైతేనేం పవన్ రీ ఎంట్రీ.. అది కూడా బయోపిక్ ద్వారా అంటే మెగాభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తల ఆనందానికి అవధులుండవేమో మరి.

Will Pawan Acts These Politician Biopic!:

Will Pawan Acts These Politician Biopic!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ