టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన తండ్రి పుట్టిన ‘బుర్రిపాలెం’ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ గ్రామంలో అభివృద్ధి పనులు షురూ అయ్యాయ్ కూడా. పనులు జరిగింది కాసిన్నే కానీ జరగాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయ్. అయితే మధ్యలో పనులు ఎందుకు ఆగిపోయాయ్.. అనేది మాత్రం తెలియరాలేదు. వాస్తవానికి దత్తత తీసుకోవడం అంటే ఆ గ్రామాన్ని రూపురేఖలు మార్చడం.. కానీ ఎందుకో ఇప్పటి వరకూ అది మాత్రం జరగలేదు.. మహేశ్ సీరియస్‌గా తీసుకుంటే ఇది ఎక్కువ రోజులు పట్టదు కూడా. ఒక్క యాడ్ లేదా సింగిల్ సినిమాలో హాఫ్ డబ్బులు మహేశ్ తనవి కాదనుకుంటే కలలో కూడా ఊహించని రీతిలో గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు.
అయితే తాజాగా ఇదే దత్తత గ్రామం విషయమై విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు భార్య.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతీని కలిసింది. సుమారు అరగంటకుపైగా వీరిద్దరి మధ్య చర్చసాగింది. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్స్ ప్రకారం. దత్తత గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సహకారం అందించాలని నమ్రత.. భారతీకి విజ్ఞప్తి చేసిందని తెలుస్తోంది. అయితే ఇందుకు సీఎం సతీమణి సానుకూలంగా స్పందించారని సమాచారం.
వాస్తవానికి ‘దత్తత’ అంటే ఏమని అర్థం.. తన దగ్గరున్న డబ్బుతో గ్రామం రూపురేఖలు మార్చడమే. దత్తత తీసుకున్న తర్వాత సర్కార్‌కు ఎటువంటి సంబంధం ఉండదు (అభివృద్ధి పథకాలు వర్తిస్తాయ్).. కానీ సీఎం భార్యను కలిసి నమ్రత సాయం కోరడం కాసింత విడ్డూరంగా అనిప్తోంది. అయితే ఈ భేటీ జరిగిన కొన్ని నిమిషాల్లోనే.. మహేశ్, నమ్రతలపై నెటిజన్లు, క్రిటిక్స్ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దత్తత తీసుకోవడం అంటే ఇదేనా..? అసలు దత్తత అంటే ఏంటో తెలిసే ఇలా చేస్తున్నారా..? లేకుంటే తెలియక చేస్తున్నారా..? మీ సొంత డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి.. దత్తత తీసుకున్నాక ప్రభుత్వాన్ని సాయం కోరడమేంటి..? మీరూ.. మీ దత్తత గ్రామం అంతే.. ఇక ప్రభుత్వం పాత్ర ఏముంటుంది..? అసలు మధ్యలో సర్కార్ ఎందుకొస్తుంది..? అంటూ రకరకాలుగా నెటిజన్లు ట్రోలింగ్స్ చేస్తున్నారు.