Advertisementt

సరిలేరులో లేడీ అమితాబ్ లుక్ అదుర్స్...

Sat 26th Oct 2019 06:49 PM
vijayashanti,ramulamma,first look,sarileru neekevvaru,superstar mahesh babu  సరిలేరులో లేడీ అమితాబ్ లుక్ అదుర్స్...
Vijayashanti Look From Sarileru Neekevvaru సరిలేరులో లేడీ అమితాబ్ లుక్ అదుర్స్...
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ అయిపోయింది. ఈ సందర్భంగా దీపావళి పండుగను పురస్కరించుకుని ముందుగా చెప్పినట్లుగా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న లేడీ అమితాబ్ విజయశాంతి లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్‌ అదుర్స్ అనిపించేలా ఉంది. కూర్చీలో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఈ స్టైలిష్ లుక్‌తో విజయశాంతి తనపాత్రపై మరింత ఇంటెన్షన్ పెంచేసింది. 

ఇదిలా ఉంటే.. 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’లో విజయశాంతి, మహేష్ బాబు కలిసి నటించిన విషయం విదితమే. తాజాగా మహేశ్ హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది. సినిమాలకు స్వస్తిచెప్పిన అనంతరం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాములమ్మ రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఆమె అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు.. సినిమాలో పాత్ర ఎలా ఉండబోతోంది..? ఆమె నటన ఎలా ఉంటుంది..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమా షూటింగ్ మొదలుకుని ఇప్పటి వరకూ మహేశ్ లుక్ తప్ప ఏ ఒక్కరి పాత్ర గురించి కానీ కనీసం చిన్నపాటి లుక్‌ను కూడా రివీల్ చేయలేదు. అంతేకాదు.. హీరోయిన్ రష్మిక లుక్‌ను ఎక్కడా విడుదల చేయకుండా దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా.. 2020 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్న దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Vijayashanti Look From Sarileru Neekevvaru:

Vijayashanti Look From Sarileru Neekevvaru  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ