రమేష్-గోపి దర్శకత్వంలో సిరి మూవీస్ పతాకంపై కె. శిరీషా రెడ్డి నిర్మాతగా నూతన చిత్రం.
‘ఇది నా లవ్ స్టోరీ’ ఫేమ్ రమేష్- గోపి దర్శకత్వంలో కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పణలో సిరిమూవీస్ పతాకంపై కె. శిరీషారెడ్డి నిర్మాతగా రమన్, వర్ష విశ్వనాధ్, పావని, దీపికా హీరో హీరోయిన్లుగా నూతన చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దర్శకులు రమేష్- గోపి చిత్ర విశేషాలను తెలుపుతూ.. ‘‘ఇది నా లవ్ స్టోరీ తర్వాత మా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఇది. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్‌లో మంచి సందేశాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ఒకహీరో, ముగ్గురు హీరోయిన్లతో రూపొందుతోన్న స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండి ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అలాగే మా చిత్రంతో అలనాటి సీనియర్ నటి వాణి విశ్వనాధ్ కూతురు వర్ష విశ్వనాధ్ హీరోయిన్‌గా పరిచయమవడం సంతోషంగా ఉంది. నవంబర్ చివరి వారం నుండి కంటిన్యూగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మా చిత్రానికి మహిత్ నారాయణ్ సంగీత సారథ్యం వహిస్తుండగా క్రిస్టోఫర్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ భాద్యతలు వహిస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉండబోతుంది’’ అన్నారు.
రమన్, వర్ష విశ్వనాధ్, పావని, దీపికా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాంకేతిక వర్గం:
బేనర్: సిరి మూవీస్,
సమర్పకులు: కొరివి పిచ్చి రెడ్డి, సరస్వతి,
సినిమాటోగ్రఫీ: క్రిస్టోఫర్ జోసెఫ్,
సంగీతం: మహిత్ నారాయణ్,
నిర్మాత: కె. శిరీషా రెడ్డి,
దర్శకత్వం: రమేష్- గోపి.