Advertisementt

ఈ భామ కూడా టాలీవుడ్‌కు టాటా చెప్పేస్తోందా?

Mon 28th Oct 2019 12:46 PM
kiaran advani,tollywood,bollywood,busy heroine  ఈ భామ కూడా టాలీవుడ్‌కు టాటా చెప్పేస్తోందా?
Kiara Advani interest on Bollywood movies ఈ భామ కూడా టాలీవుడ్‌కు టాటా చెప్పేస్తోందా?
Advertisement
Ads by CJ

చాలా తక్కువ కాలంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది కియరా అద్వానీ. తెలుగులో తన మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఏమి ఒప్పుకోవడంలేదు. హిందీ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో క్షణం ఖాళీ లేకుండా బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం హిందీలో ఓ ఐదు భారీ చిత్రాల్లో నటించేస్తోంది.


లక్ష్మీ బాంబ్- గుడ్ న్యూస్- ఇందూకి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది అద్వానీ. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘లక్ష్మీ బాంబ్’ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆమె రాయ్ లక్ష్మీ పోషించిన పాత్రను పోషిస్తోంది. అలానే కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘గుడ్ న్యూస్’ లోనూ అక్షయ్ - దిల్జీత్ లాంటి స్టార్లతో కలిసి నటిస్తోంది.
విష్ణు వర్ధన్ దర్శకత్వం ‘షేర్ షాలో’నూ కియరా కీలక పాత్ర పోషిస్తోంది. అలానే యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ‘భూల్ బులయా 2’లో ఈమె నటిస్తుంది. ఇదొక హారర్ కామెడీ చిత్రం. ఆదిత్య సీల్ అనే కుర్ర హీరో సరసన ఇందూకి జవానీ చిత్రంలో ఆడిపాడుతోంది. ఇలా వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిన కియారా అక్కడ ఖాళీగా ఉంటే అప్పుడు టాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిద్దాం అంటోందట.

Kiara Advani interest on Bollywood movies:

Kiara says bye bye to tollywood 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ