Advertisementt

క్రిస్మస్ ఫైట్ రసవత్తరం కాబోతోంది!

Mon 28th Oct 2019 06:28 PM
ruler,prathiroju pandage,bheeshma,disco raja,christmas fight  క్రిస్మస్ ఫైట్ రసవత్తరం కాబోతోంది!
4 Movies In Christmas Race at Tollywood క్రిస్మస్ ఫైట్ రసవత్తరం కాబోతోంది!
Advertisement
Ads by CJ

ఈ క్రిస్మస్ పండగకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నలుగురు స్టార్ హీరోల సినిమాలు క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతున్నాయి. భారీ హిట్లు కొట్టాలని మన హీరోస్ ఉవ్విళ్లూరుతున్నారు. వారు ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ, రవితేజ, నితిన్, సాయి ధరమ్ తేజ్.. ఈ క్రిస్మస్‌ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు ఉన్నారు.

సంక్రాంతికి రావాల్సిన బాలయ్య సినిమా కొంచెం ముందుగానే వస్తుంది. డిసెంబర్ 20న ఈ మూవీని రిలీజ్ చేయాలనీ తాజాగా డేట్ ఫిక్స్ చేశారు. రీసెంట్‌గానే న్యూ లుక్‌తో పాటు టైటిల్‌ని, రిలీజ్ ‌డేట్‌ని ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్‌తో నిరుత్సాహ పరిచిన బాలయ్య ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఇక అదే రోజు అంటే డిసెంబర్ 20న రవితేజ -వి.ఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘డిస్కోరాజా’,  సాయిధరమ్ -మారుతి కలయికలో తెరకెక్కుతోన్న ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

రవితేజకు ‘డిస్కోరాజా’ హిట్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే అతనికి హిట్ పడి చాలా ఏళ్ళు అవుతుంది. అలానే సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. నితిన్ ‘భీష్మ’ కరెక్ట్‌గా పండగ రోజు అంటే డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇలా ఒక్క వారంలోనే నాలుగు సినిమాలు రావడంతో ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

4 Movies In Christmas Race at Tollywood:

Ruler vs Prathiroju Pandage vs Bheeshma vs Disco Raja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ