టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత బాగా తెలుస్తుంది. హీరోయిన్స్ కొరత వలనే హిట్స్ లేకపోయినా.. స్టార్ హీరోలంతా పూజా హెగ్డే వెంటపడాల్సి వస్తుంది. పూజా తర్వాత రష్మిక మందన్నని లిస్ట్‌లోకి చేర్చుకున్నారు. పూజా హెగ్డే నాలుగురు స్టార్ హీరోస్ తో పనిచేసిన తర్వాత రెమ్యునరేషన్ పెంచింది. కానీ రష్మిక మొదటిసారిగా మహేష్ తో పనిచేస్తూనే తన పారితోషకాన్ని డబుల్ చేసింది అని, పారితోషకం కారణంగా అవకాశాలు వదులుకుంటుంది అనే టాక్ గత వారం పది రోజులుగా నడుస్తూనే ఉంది. ఆమె పెంచిన పారితోషకం ఇవ్వలేక నిర్మాతలు బెదిరిపోతున్నారు అని అంటున్నారు. అయితే పారితోషకం న్యూస్ ల విషయం తెలిసిన రష్మిక... ఈ విషయంపై కాస్త ఘాటుగా స్పందించింది.
క్రేజ్ ఉన్న హీరోయిన్ కి ఎంత పారితోషకం ఇవ్వాలో నిర్మాతలకు తెలియదా, ఓ నిర్మాత హీరోయిన్ కి కోటి పారితోషకం ఇస్తున్నాడు అంటే... ఆమె డిమాండ్ ని బట్టే ఇస్తాడు కానీ.. ఊరికే ఆమెకి కోటి ఇవ్వరు కదా, అంతేకాని హీరోయిన్స్ డిమాండ్ చేసేస్తే నిర్మాతలు కోట్లు ఇచ్చేస్తారా అంటూ ఫైర్ అవుతుంది. అలాగే పారితోషకం పెంచడం వలన తానేమీ అవకాశాలు కోల్పోలేదని, తనకి కొన్ని కథలు నచ్చక, అలాగే కథ నచ్చినా తన పాత్రలు నచ్చక తానే అవకాశాలు వదులుకుంటున్నానని చెబుతుంది. మరి పారితోషకం ఆడగకుండానే రష్మిక పారితోషకం పెంచిందనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవదు కదా... అంటూ కొంతమంది నోళ్లు నొక్కుకుంటున్నారు.