తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ.. హీరోయిన్‌గా చిన్న సినిమాలు చేస్తూనే ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్‌గా అరవింద సమేతలో నటించింది. ఆ సినిమాలో ఈషాకి పేరు రాకపోయినా.. కొన్నాళ్లు ‘అరవింద సమేత’ పేరు చెప్పుకుంటే.. అవకాశాలు వస్తాయనుకుంది. కానీ అరవింద సమేత ఆమెకి ఎలాంటి హెల్ప్ చేయలేదు. ఇక మళ్ళీ హీరోయిన్ గా రాబోయే 24 గంటల్లో సినిమాలో సత్య దేవ్ సరసన నటించింది. రాబోయే 24 గంటల్లో చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా విషయం పక్కనబెడితే.. ఈషా రెబ్బ ఈమధ్యన గ్లామర్ గా హాటెస్ట్ యాంగిల్స్‌లో హడావిడి మొదలెట్టింది.
ఎప్పుడూ ట్రెడిషనల్‌గా కనబడే ఈషా రెబ్బ హాటెస్ట్ ఫోటో షూట్స్‌తో తనలో గ్లామర్ యాంగిల్ కూడా ఉందని చూపిస్తుంది. ఇకపోతే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో సినిమా ఆడియో వేడుకలో ఎన్టీఆర్‌ని ఎత్తేసిన ఈషా రెబ్బ ఇప్పుడు ఆ చిత్ర దర్శకనిర్మాతలకు చుక్కలు చూపెడుతుందంట. విడుదలకు దగ్గరవుతున్న సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్‌కి రాకుండా ఈషా రెబ్బ తప్పించుకుంటుందని, నిర్మాతలు కాస్త స్పెషల్ ఇంటర్వ్యూకి రమ్మన్నా ఈషా రెబ్బ రావడం లేదని అంటున్నారు. మరి పెద్దగా హీరోయిన్ అవకాశాలు కూడా లేని ఈషా రెబ్బ ఇలా ఎందుకు చేస్తుందో తెలియదు కానీ.. ఆమెకొచ్చే చిన్నా చితక అవకాశాలు కూడా ఇలాంటి న్యూస్ లతో చేజారిపోయే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి.