బిగ్ బాస్ తెలుగులో సీజన్ సీజన్ కి వ్యాఖ్యాత మారుతూనే ఉన్నారు. సీజన్ 1 కి ఎన్టీఆర్ అదిరిపోయే హోస్టింగ్ చేస్తే.. సెకండ్ సీజన్ లో నాని హోస్టింగ్ కి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. ఇక మూడో సీజన్ లో నాగార్జునకి ఇంతవరకు బిగ్ బాస్ ప్రేక్షకుల ట్రోలింగ్ సెగ తగల్లేదు కాని.. తాజాగా శ్రీముఖి విషయంలో ఇప్పుడు నాగ్ ని కూడా ఆడేసుకుంటున్నారు నెటిజెన్లు. ఈ సీజన్ లో పెద్దగా పేరున్న సెలబ్రిటీస్ ఎవరూ లేకపోవడంతో.. చాలా డల్ గా సాగుతున్న సీజన్ 3 ని మొదట్లో కాస్త ఇంట్రెస్ట్ కలిగించేలా నడిపించిన నాగార్జున ఇప్పుడు మరీ పేలవంగా షో ని అడిస్తున్నాడు అంటూ... సీజన్ 3 ఎండ్ దగ్గరకొచ్చేటప్పటికీ.. నాగ్ హోస్టింగ్ మీద ట్రోలింగ్ మొదలయ్యింది.
బిగ్ బాస్ నిర్వాహకులతో పాటుగా నాగార్జున కూడా శ్రీముఖిని సేవ్ చెయ్యడానికి ప్రతి వీకెండ్ ట్రై చేస్తున్నారనే కామెంట్స్ పడుతున్నాయి. మొదట్లో అదిరిపోయే హోస్టింగ్ తో ఆకట్టుకున్న నాగార్జున చివరికి వచ్చేసరికి బిగ్ బాస్ వీక్ ఎపిసోడ్స్ చూడకుండానే వీకెండ్ ఎపిసోడ్ చేస్తున్నాడని, వీక్ డేస్ లో ఏం జరిగిందో కూడా నాగ్ కి తెలీయడం లేదు గనుకనే.. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ విషయంలో కంటెస్టెంట్స్ అడిగి వివరాలు తెలుసుకుంటున్నాడని, అందుకే షో మీద ఇంట్రెస్ట్ పోయిందంటూ ప్రచారం మొదలయ్యింది. ఇక వచ్చే ఆదివారం జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ కి చిరుని గెస్ట్ గా పిలిచారని, నాగ్ మాట కాదనలేక ఫైనల్ విన్నర్ కి ట్రోఫీ ఇవ్వడానికి చిరు వస్తున్నాడని అంటున్నారు. అంతే కాదు... హాట్ హీరోయిన్స్ హెబ్బా పటేల్, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్స్ బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ స్టేజి మీద హాట్ డాన్స్ పెరఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని అంటున్నారు.