Advertisementt

సుమంత్ కొత్త చిత్రం రెగ్యులర్ షూట్ మొదలైంది

Sat 02nd Nov 2019 11:10 AM
sumantha,sumantha new film,shooting update,nanditha,pooja kumar  సుమంత్ కొత్త చిత్రం రెగ్యులర్ షూట్ మొదలైంది
Sumanth New Film Regular Shoot Started సుమంత్ కొత్త చిత్రం రెగ్యులర్ షూట్ మొదలైంది
Advertisement
Ads by CJ

సుమంత్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

వైవిధ్య‌మైన కధాంశాలతో హీరోగా త‌న‌కంటూ ఓ హీరోగా ఇమేజ్‌ను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు సుమంత్‌. ఈయ‌న హీరోగా న‌టిస్తున్న త‌దుపరి చిత్రం ఖ‌రారైంది. క‌న్న‌డ చిత్రం ‘కావ‌లూడారి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. క‌న్న‌డలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేయ‌బోతున్నారు. క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.జి.ధ‌నంజ‌య‌న్ ఈ చిత్రాన్ని రెండు భాష‌ల్లో నిర్మిస్తున్నారు. సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండగా... త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టుల‌తో ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. 

ఇటీవ‌ల విడులైన విజ‌య‌వంత‌మై అర్జున్‌, విజ‌య్ ఆంటోని ‘కిల్ల‌ర్‌’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించుకున్న‌ సైమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్ట‌ర్‌గా, విదేశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. విజ‌య్ ఆంటోనితో భేతాళుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో విజ‌య‌వంత‌మైన క్ష‌ణం చిత్రాన్ని తమిళంలో స‌త్యరాజ్ త‌న‌యుడు శిబిరాజ్‌తో స‌త్య అనే పేరుతో తెర‌కెక్కించి త‌మిళంలోనూ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి. శుక్ర‌వారం(న‌వంబ‌ర్ 1) నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను చెన్నైలో స్టార్ట్ చేశారు. చెన్నై, హైద‌రాబాద్ ప్రాంతాల్లో జ‌న‌వ‌రిలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. మార్చి నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.  

న‌టీన‌టులు:

సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి

నిర్మాత‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌

యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌

మ్యూజిక్‌:  సైమ‌న్ కె.కింగ్‌

ఆర్ట్‌:  విదేశ్‌

ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ కె.ఎల్‌

మాట‌లు:  బాషా శ్రీ

స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌

క‌థ‌:  హేమంత్ ఎం.రావు

పి.ఆర్‌.ఓ: వంశీ కాకా

Sumanth New Film Regular Shoot Started:

Sumanth New Film Latest UPdate

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ