Advertisementt

పవన్ రీ ఎంట్రీ: 2 సినిమాలు.. 100 కోట్లు!

Sun 03rd Nov 2019 11:00 PM
pawan kalyan,2 films,re entry,100 crores,pink remake,krish,am ratnam,dil raju  పవన్ రీ ఎంట్రీ: 2 సినిమాలు.. 100 కోట్లు!
Pawan Kalyan 2 Films Confirmed పవన్ రీ ఎంట్రీ: 2 సినిమాలు.. 100 కోట్లు!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ షురూ అయ్యింది. నిన్నమొన్నటివరకు.. పవన్ రీ ఎంట్రీ మీద క్లారిటీ లేని వార్తలొచ్చాయి. కానీ నిన్న శనివారం బాలీవుడ్ టాప్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్‌తో పవన్ రీ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ రీమేక్ చెయ్యబోతున్నాడు. ఇది కన్ఫర్మ్. త్వరలోనే దిల్ రాజు కాంపౌండ్ నుండి అధికారిక న్యూస్ రానుంది. ఇక పవన్ కళ్యాణ్, క్రిష్‌తో కూడా మరో సినిమా చెయ్యబోతున్నాడు. జానపద నేపథ్యం ఉన్న కథలో పవన్ కళ్యాణ్.. క్రిష్ తో కలిసి పని చెయ్యబోతున్నాడు. రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం, పవన్ కున్న క్రేజ్ కారణంగా సినిమా మొదలవ్వకముందే పవన్ రీ ఎంట్రీ సినిమాపై భారీ అంచనాలు ట్రేడ్ లో మొదలయ్యాయి.

అయితే పవన్ కళ్యాణ్ తో పనిచేసేందుకు మొదటినుండి ఇంట్రెస్ట్ గా ఉన్న దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల పారితోషకం ఆఫర్ చేసాడని టాక్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో లేకపోయినా.. అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా పవన్ కి 50 కోట్ల పారితోషకం ఇస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్, క్రిష్ తో చెయ్యబోయే సినిమాకి కూడా ఏ. ఎం. రత్నం పవన్ కి అక్షరాలా 50 కోట్లు ఇవ్వబోతున్నాడట. పవన్ కళ్యాణ్ కి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న రత్నం ఇప్పుడు క్రిష్ తో చెయ్యబోయే సినిమాకి 50 కోట్ల పారితోషకాన్ని పవన్ కి ఇస్తున్నాడట. మరి సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ జీరో అయినా.. మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన వ్యక్తికీ ఈ రేంజ్ క్రేజ్ ఉండడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి.

Pawan Kalyan 2 Films Confirmed:

Pawan Kalyan 100 Cr Pay For 2 Films

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ