Advertisementt

దేవిశ్రీ, థమన్.. ప్రస్తుతానికి థమనే టాప్!

Tue 05th Nov 2019 08:28 PM
thaman,top place,sankranthi race  దేవిశ్రీ, థమన్.. ప్రస్తుతానికి థమనే టాప్!
Thaman Top Place in Sankranthi Race దేవిశ్రీ, థమన్.. ప్రస్తుతానికి థమనే టాప్!
Advertisement
Ads by CJ

రంగస్థలం తర్వాత దేవిశ్రీ మ్యూజిక్ అంతగా ఎవ్వరికీ ఎక్కడం లేదో... లేదంటే ఈ మధ్యలో థమన్ హైలెట్ అయ్యాడో గాని.. మొత్తం మీద దేవిశ్రీ మాత్రం కాస్త నెమ్మదించాడు. తాజాగా థమన్ హవా ఎక్కువగా కనబడడం.. దేవిశ్రీ డల్ అవడంపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా థమన్ అల వైకుంఠపురములో సినిమాతో అదరగొట్టేస్తున్నాడు. అంతేకాకుండా వెంకిమామ, ప్రతి రోజు పండగే సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కావడం... ఆ సినిమాలు కూడా విడుదలకు సిద్దమవడంతో థమన్ పేరు ప్రతిరోజూ మీడియాలో వినబడుతూనే ఉంది.

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాతో దేవిశ్రీ కూడా మంచి ఆల్బమ్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాడు. కాకపోతే ఇంకా సరిలేరు సింగిల్స్ మార్కెట్ లోకి రాకపోవడం, అల వైకుంఠపురములో సినిమా పాటలు మర్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. సామజవరాగమనా, రాములో రాముల పాటలు యూత్ ని ఊపెయ్యడం, రెండు పాటలకు అదిరిపోయే వ్యూస్ రావడంతో థమన్ పేరు బాగా మార్మోగిపోతోంది. మరి సరిలేరు పాటలు కూడా వదిల్తే దేవిశ్రీ సత్తా ఏమిటో తేలిపోతుంది. ఒకవేళ సరిలేరు పాటలు కాస్త డౌన్ అయ్యాయా... ఇక థమన్ టాప్ పొజిషన్ కి వెళ్లడం ఖాయం.

Thaman Top Place in Sankranthi Race:

Thaman Creates Sensation with His Music

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ