టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్‌లోకి సర్రున దూసుకొచ్చిన బాలీవుడ్ భామ పూజా హెగ్డే. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న పూజా హెగ్డే లక్కీ హీరోయిన్ అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. పూజా హెగ్డేకి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. కానీ అమ్మడు కెరీర్ మాత్రం జెట్ స్పీడులో దూసుకుపోతుంది. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ లను మూకుమ్మడిగా చక్కబెడుతున్న పూజాకి మరో ఛాన్స్ వచ్చిందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. తాజాగా పూజా కొచ్చిన ఛాన్స్ అలాంటి ఇలాంటి ఛాన్స్ కాదు. ఏకంగా పవర్ స్టార్ సరసన పూజా హెగ్డే ఛాన్స్ కొట్టెయ్యబోతుందనే న్యూస్ ఉంది... నిజంగా పూజా లక్కీనే అనిపిస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి పింక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దిల్ రాజు - బోణి కపూర్ నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమా కోసం నయనతారని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా నయన్ కన్నా పూజ బెటర్ అంటున్నారని, ఇప్పటికే బోణి కపూర్ పూజాతో భేటీ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే బోణి కపూర్ తో పూజ భేటీ విషయంలో పవన్ సినిమా కోసమా.. లేదంటే అజిత్ తో చేసే సినిమా కోసం పూజాని సంప్రదించారా అనేది కాస్త సస్పెన్స్.