రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం.. ఈ ఇద్దరి పేర్లు ప్రత్యేకించి మరీ తెలుగు సినీ ప్రేక్షకులకు.. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ ప్రియులకు అస్సలు పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పుడు వీరిద్దరికీ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ హౌస్‌లో వీళ్లిద్దరు ఏ రేంజ్‌లో హల్‌చల్ చేశారో అందరికీ తెలిసిందే. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందు అసలు ఒకరిముఖం ఒకరు కనీసం గూగుల్‌లో చూసుకుని ఉండరేమో.. ఇప్పుడు మాత్రం ఇద్దరిలో ఎవరి పేరు కొట్టినా బోలెడెన్ని ఫొటోలు వచ్చేస్తున్నాయ్.. అవి కూడా వీళ్లిద్దరూ కలిసున్నవే. బిగ్‌బాస్ షోతో పునర్నవీకి వచ్చినంత ఫేమ్.. బహుశా ఎన్ని సినిమాల్లో నటించినా రాదేమో. పునర్నీవీకి ఫేమ్ వచ్చింది.. రాహుల్ బిగ్‌బాస్ టైటిల్ వచ్చింది.
ఇక అసలు విషయానికొస్తే.. పున్నుపై రాహుల్ మనసుపడటం.. ఆ హాట్ బ్యూటీ కాదనడం.. తాను వేరొకరితో లవ్‌లో ఉన్నానని చెప్పడం.. అయినప్పటికీ రాహుల్ మాత్రం డేటింగ్ రావాలని పిలవడం ఇవన్నీ షోలో జరిగిపోయాయ్. అప్పట్లో వీరిద్దరి వ్యవహారంపై రాయని వార్తల్లేవ్.. వెబ్‌సైట్లు చేయని హంగామా లేదు. ఇప్పుడు షో అయిపోయింది.. ఎవరి దారి వాళ్లదే అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఇంకేదో ఉందని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. రాహుల్ ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. పున్ను బేబీ, ఫ్యామిలీ రెడ్ సిగ్నల్‌లోనే ఉందని.. అది కాస్త గ్రీన్‌కు మారే అవకాశాలున్నాయట. అయితే ఇప్పటి వరకూ వస్తున్న వార్తలకు సింగిల్ మాటతో రాహుల్ తల్లిదండ్రులు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
రాహుల్, పున్నూ వర్షెన్ ఇదీ..
అవును నేను పునర్నవీని డేటింగ్‌కు పిలిచాను.. అది వాస్తవమే. కానీ పున్ను రానంది. ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారు. పునర్నవి అంటే నాకు గౌరవముంది. మేమిద్దరం మంచి స్నేహితులం.. ప్రాణ స్నేహితులం’ అని చెప్పాడు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవి కూడా లవ్, డేటింగ్, పెళ్లి అంటూ చాలా ప్రశ్నలే ఎదురవుతున్నాయ్. అయితే.. పున్నూ మాత్రం ఎస్ అనీ కానీ.. నో అని కానీ చెప్పకుండా నవ్వుతూ మిన్నకుండిపోతోంది.. దీంతో మౌనం అంగీకారమని అందరూ భావిస్తున్నారు.
రాహుల్ పేరెంట్స్ ఏమంటున్నారు..!?
రాహుల్‌కు టైటిల్ వచ్చేసింది.. రూ. 50లక్షలు అకౌంట్‌లో పడ్డాయ్.. ఇక మిగిలిందల్లా ఆ డబ్బుతో ఏదో ఒక బిజినెస్ పెట్టి.. లైఫ్‌లో సెటిలయ్యి పెళ్లి చేసుకోవడమే. పున్నును ఇప్పటికీ రాహుల్ ప్రేమిస్తూనే ఉండటంతో ఇంటికొచ్చాక అసలు విషయం తెలుసుకున్నారు పేరెంట్స్. దీంతో పున్నుతో పెళ్లికి తాము సిద్ధంగానే ఉన్నామని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మీ ఇద్దరికీ ఇష్టమైతే మధ్యలో మాకేంటి అభ్యంతరం అన్నట్లుగా ఏ మాత్రం ఆలోచించకుండా రాహుల్‌ను అర్థం చేసుకుని ఓకే చెప్పేశారు.
ఇక మిగిలుంది.. పున్ను బేబీ అభిప్రాయం మాత్రమే. ఇప్పటికే తాను వేరొకరితో రిలేషన్‌లో ఉన్నానని చెప్పేసింది. మరి ఇందులో ఎంత నిజముందో..? రాహుల్‌ను టెస్ట్ చేసిందో అన్నది ఆమె మనసుకో తెలియాలి. మరి రాహుల్‌పై తన అభిప్రాయాన్ని బయటపెట్టకపోవడంతో.. ఇటు వీరిద్దరి అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి మొదలైంది. మొత్తానికి చూస్తే.. పున్ను బేబీకి మాత్రం పెద్ద పరీక్ష ఎదురైంది.. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక సతమతమవుతోందట. అయితే ఒక వేళ ఆమె వేరొకరితో రిలేషన్‌లో ఉంటే.. రాహుల్‌ను ఏం చేయబోతోంది..? అతడ్ని సైడ్ చేసి రాహుల్‌తో లైఫ్ షేర్ చేసుకుంటుందా..? లేకుంటే రాహుల్‌నే వదిలేస్తుందా..? పున్న పయనమెటో.. అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.