నవంబర్ 7న ‘వెంకీ మామ’ తొలి సాంగ్ విడుదల
విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం ‘వెంకీమామ’. దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ హీరోల కలయికలో తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా తొలిసాంగ్‌ను గురువారం(నవంబర్ 7న) విడుదల చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
నటీనటులు:
వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
నిర్మాతలు: సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్