Advertisementt

ఆమె చేసినవి రమ్యకృష్ణతో రీ షూట్ చేస్తున్నారంట!

Fri 08th Nov 2019 02:11 PM
romantic,mandira bedi,ramyakrishna,reshoot,puri jagan,puri akash  ఆమె చేసినవి రమ్యకృష్ణతో రీ షూట్ చేస్తున్నారంట!
Ramya Krishna Replaces Mandira Bedi in Romantic ఆమె చేసినవి రమ్యకృష్ణతో రీ షూట్ చేస్తున్నారంట!
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత రమ్యకృష్ణ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. వరస సినిమాలతో బిజీ అయిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న ‘రొమాంటిక్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే రమ్యకృష్ణ రొమాంటిక్ లో చేస్తున్న పాత్రకి ముందుగా బాలీవుడ్ అందాల సీనియర్ నటి మందిరా బేడీని తీసుకున్నారట.. అయితే మందిరా బేడీ రొమాంటిక్ షూటింగ్ లో పాల్గొని కొంతమేర షూటింగ్ కూడా చేసిందట. మొన్నామధ్యన సాహో లాంటి బిగ్గెస్ట్ సినిమాలో కాసేపు మెరిసింది. ఆ సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువ కాబట్టి ఆమె నటన పెద్దగా జనాలకు అర్ధం కాలేదు.

అయితే రొమాంటిక్ షూటింగ్ లో మందిరా బేడీ చేసిన సీన్స్ రషెస్ చూసిన యూనిట్ కి ఆ సీన్స్ సంతృప్తిని ఇవ్వలేదు... అలాగే ఆ పాత్రకి మందిరా సెట్ కాదనిపించింది యూనిట్ వెంటనే రమ్యకృష్ణని సంప్రదించి... ఆమెతో మందిరా బేడీ నటించిన సీన్స్ అన్నిటిని రీ షూట్స్ చేస్తున్నట్లుగా టాక్. రమ్యకృష్ణ ఆ పాత్రకి కరెక్ట్ గా సరిపోతుందని.. ఆమెని తీసుకొచ్చారట. అయితే మందిరా అయితే ఇంకాస్త క్రేజ్ ఉంటుందని... ముందుగా ఆమెని తీసుకుందట టీమ్. కానీ మందిరతో మొదటికే మోసం రావడంతో సైలెంట్ గా రమ్యకృష్ణతో పని కానిచ్చేస్తున్నారట.

Ramya Krishna Replaces Mandira Bedi in Romantic:

Romantic Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ