తమిళంలో ధనుష్ హీరోగా దసరాకి విడుదలైన అసురన్ అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే అసురన్ సినిమాని తెలుగులో డబ్ చెయ్యకుండా బడా నిర్మాత సురేష్ బాబు తన తమ్ముడు వెంకటేష్ కోసం ఆ సినిమా హక్కులను కొనేసాడు. అయితే వెంకటేష్ హీరోగా అసురన్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ సినిమాని రీమేక్ చేసేందుకు ఇంకా దర్శకుల వేటలోనే సురేష్ బాబు, వెంకటేష్ లు ఉన్నారు. అలాగే వెంకటేష్ వెంకీమామ సినిమాతో బిజీగా ఉండడంతో అసురన్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది తెలియదు.
అయితే ఈలోపు అసురన్ రీమేక్ లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా శ్రీయ శరణ్ ఫైనల్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. పెళ్లి తర్వాత కెరీర్ లో డల్ అయిన శ్రియ శరణ్.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ.. సీనియర్ హీరోలకు నేను ఓ ఆప్షన్ అంటూ సంకేతాలు పంపుతుంది. ఎవరూ ముందుకు రాకపోయినా.. సురేష్ బాబు మాత్రం తన తమ్ముడు వెంకటేష్ కోసం శ్రియ శరణ్ ని సంప్రదిస్తున్నట్లుగా ఫిలింనగర్ న్యూస్. మరి హీరోయిన్ గా శ్రియ అని, దర్శకుడు ఎవరనేది త్వరలోనే సురేష్ బాబు అండ్ టీం ఓ అధికారిక ప్రకటన ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట.