Advertisementt

ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్.. నిజమేనా!

Sun 10th Nov 2019 08:06 PM
production house,jr ntr,tollywood,rrr movie  ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్.. నిజమేనా!
IS Jr Ntr Plan to start production house? ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్.. నిజమేనా!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లోని ఇప్పుడున్న కుర్ర హీరోలంతా సినిమాల్లో నటించడమే కాదు.. నిర్మించేస్తున్నారు కూడా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని మంచి క్రీజ్‌లో ఉన్నప్పుడే చేయాల్సిన వన్నీ చేసేయాలని.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కుర్ర హీరోలు భావిస్తున్నారు. అందుకే సినిమాల్లో ఓ వైపు నటిస్తూనే మరోవైపు బిజినెస్‌లు చేస్తున్నారు. అయితే ఈ బిజినెస్‌లు కొందరికి కలిసిరాగా.. మరికొందరు అట్టర్ ప్లాప్‌ అయ్యి లాక్కోలేక.. పీక్కోలేక తలకిందపెట్టి తపస్సు చేస్తున్నారు!. ఒక కుర్ర హీరోలే కాదు.. హీరోయిన్స్ సైతం ఈ మధ్య ఎక్కువగా బిజినెస్ బాటే పడుతున్నారు. ముఖ్యంగా నిర్మాణంవైపే ఎక్కువగా ఆసక్తిగా చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల్లో నటించడమే కాదు నిర్మించాలని గట్టిగా అనుకున్నాడేమో గానీ జూనియర్ కూడా కొత్త బిజినెస్ పెట్టేస్తున్నాడట. త్వరలోనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇకపై త‌న సినిమాల‌తో పాటు.. మంచి మంచి కథలు దొరికితే నిర్మాణంలో పాలు పంచుకోవాలని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి లేదా ‘RRR’ షూటింగ్‌ పూర్తయిన తర్వాత నిర్మాణ సంస్థ స్థాపించాలని ఫిక్స్ అయిపోయాడట. ఇప్పటికే ఆ నిర్మాణ సంస్థకు తన తండ్రి హరికృష్ణ, కుమారుడు పేరు రెండూ కలిసొచ్చేలా ఓ మంచి పేరు సెలెక్ట్ చేయాలని తన మిత్రులకు సూచించారట.

కాగా.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్‌, కళ్యాణ్ రామ్, నేచురల్ స్టార్ నాని, విజయ్‌ దేవరకొండలు సినిమాల్లో నటిస్తూనే.. సొంతంగా నిర్మాణ రంగంలో దిగి తమ సత్తాచాటుకుంటున్న విషయం విదితమే. తాజాగా ఎన్టీఆర్ కూడా ఇలానే అడుగులేయాలని నిర్ణయించారట. అయితే ఎన్టీఆర్ చేస్తున్న ప్రయత్నం మంచిదే.. మరి ఇందులో నిజమెంతుందో.. అసలు సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించే ఆలోచన ఉందో లేదో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ.

IS Jr Ntr Plan to start production house?:

IS Jr Ntr Plan to start production house?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ