ఇదేంటి సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిందా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది కాస్త నిజమే కానీ.. సినిమాల్లో నటించట్లేదు కానీ.. సినిమాకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారింది. అలా తెలుగు ప్రేక్షకులను, మహేశ్ ఫ్యాన్స్‌ను ఈ గారాలపట్టి అలరించునున్నది. ఇక అసలు విషయానికొస్తే.. 2013లో వచ్చిన పాపులర్ యానిమేటెడ్ హాలీవుడ్ మూవీ ‘ఫ్రోజెన్’కు సీక్వెల్‌గా.. ‘ఫ్రోజెన్ 2’ చిత్రం వస్తోంది. ఈ సినిమాను డిస్నీ సంస్థ నిర్మిస్తుండగా.. క్రిస్ బక్ అండ్ జెన్నిఫర్ లీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ‘ఎల్సా’.. ‘అన్నా’ అనే రెండు పాత్రలే.. సినిమా హిట్టవ్వడానికి ఈ రెండు పాత్రలే ఊపిరిగా నిలిచాయి కూడా.
అయితే ఈ రెండు పాత్రలకు బాలీవుడ్‌లో సిస్టర్స్.. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా డబ్బింగ్ చెప్పినట్లు సదరు నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో ఇదివరకే తెలిపింది. అయితే ఇదే సినిమాను తెలుగులోకి కూడా తెస్తున్నారు. తెలుగులో ‘ఎల్సా’ పాత్రకు నిత్యా మీనన్, మహేశ్ గారాలపట్టి సితార పాప వాయిస్ ఇచ్చింది. అదెలాంగంటే.. చిన్నప్పటి ఎల్సాకు సితార.. పెద్దయిన తర్వాత ఎల్సాకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థ డిస్నీ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ చిత్రం నవంబర్ 22న ఈ చిత్రం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదలవుతోంది.
ఇదిలా ఉంటే.. సితార డబ్బింగ్‌పై ఆమె తల్లి నమత్రా స్పందించింది. సితార చిన్నప్పట్నుంచి ఫ్రోజెన్‌ను చూస్తూ పెరిగిందని.. అప్పటి నుంచి ఎల్సా పాత్ర అంటే ఆమెకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. యంగ్ ఎల్సాకు తన గాత్రాన్ని ఇవ్వడంతో సినిమాపై ఆమెకున్న ఇష్టం మరింత పెరిగిపోయిందని తెలిపింది. ఈ సందర్భంగా సినిమాకు వాయిస్ ఇచ్చే అద్భుతమైన అవకాశాన్ని సితారకు ఇచ్చినందుకు డిస్నీకి నమత్రా థ్యాంక్స్ చెప్పింది.