Advertisementt

‘వరల్డ్ ఫేమస్ లవర్’ని పక్కన పెట్టేశాడేంటి?

Tue 12th Nov 2019 12:03 PM
vijay deverakonda,stand,world famous lover,no promotions  ‘వరల్డ్ ఫేమస్ లవర్’ని పక్కన పెట్టేశాడేంటి?
Vijay Deverakonda Stand on World Famous Lover ‘వరల్డ్ ఫేమస్ లవర్’ని పక్కన పెట్టేశాడేంటి?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండకి సినిమాల హిట్స్ ఉన్నప్పుడు చాలా యాక్టీవ్ గా కనబడతాడు. గీతగోవిందం, టాక్సీవాలా హిట్స్ తర్వాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ విషయంలో చాలా హుషారుగా కనిపించాడు. డియర్ కామ్రేడ్ పోవడం మరోపక్క తాను ప్రొడ్యూస్ చేసిన మీకు మాత్రమే చెప్తా బ్రేక్ ఈవెన్ అందుకున్నప్పటికీ.... ఆ సినిమాతో ప్లాప్ కొని తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం విషయంలో చాలా సైలెంట్ గా కనబడుతున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

అయితే ఫస్ట్ లుక్ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ అప్ డేట్ ఏం లేదు. ఆసలు విజయ్ దేవరకొండ ఆ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తాడో కూడా చెప్పడం లేదు. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా ఏం లేవు. అసలు విజయ్ దేవరకొండకి వరల్డ్ ఫేమస్ లవర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా కనిపించడం లేదు. మరి డియర్ కామ్రేడ్ ప్లాప్ తర్వాత తనకు ఇప్పుడు వచ్చే సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. కానీ విజయ్ అలాంటి ప్రయత్నాలేమీ చెయ్యడం లేదు. చాలా సైలెంట్ మోడ్ లో కనబడుతున్నాడు. మరి తన తదుపరి చిత్రం ఫైటర్ గురించి అక్కడక్కడా స్పందిస్తున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కబుర్లు మాత్రం చెప్పడం లేదు.

Vijay Deverakonda Stand on World Famous Lover:

No Promotions to World Famous Lover

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ