టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ చిత్రానికి సంబంధించిన చిన్నపాటి లుక్స్ తప్ప సాంగ్ కానీ.. టీజర్, ట్రైలర్ ఏమీ వదల్లేదు. దీంతో ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని మహేశ్ వీరాభిమానులు, ఘట్టమనేని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సరిలేరుతో పాటు సంక్రాంతికి రిలీజ్ అయ్యే ‘అల వైకుంఠపురంలో..’ ప్రమోషన్స్ పరంగా దూసుకెళ్తుండటం.. ఇప్పటికే రిలీజ్ అయిన ‘సామజవరగమన’..‘ రాములో రాముల’ యూట్యూబ్‌ను షేక్ చేస్తుండటంతో మహేశ్ అభిమానుల్లో మరింత టెన్షన్ పెరిగింది. మా బాస్ సినిమా సాంగ్స్ ఎలా ఉంటాయో.. స్టోరీ ఎలా ఉంటుందో అని ఇంటెన్షన్ పెరిగిపోతోంది. అందుకే బన్నీ ‘అల...’కు పోటీగా సరిలేరులో డబుల్ స్పెషల్‌ను చిత్రబృందం ప్లాన్ చేసిందట.
ఈ క్రమంలో అటు ప్రమోషన్స్, సాంగ్స్ పట్టించుకోకపోవడంపై రకరకాలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు వాస్తవానికి చిన్నపాటి లిరిక్ లేదా సాంగ్ రిలీజ్ చేద్దామని చిత్రబృందం భావించినప్పటికీ రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్- అనీల్ రావిపూడి మధ్య విబేధాలు వచ్చాయని.. దీంతో సాంగ్స్ రిలీజ్ చేయలేకపోయారని కూడా పుకార్లు వచ్చాయి. అయితే అందులో ఎంత నిజముందో అనేది ఇప్పటికీ తెలియరాలేదు.. ఎవరూ క్లారిటీ ఇచ్చుకోలేదు. తాజాగా సినిమా సాంగ్స్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. అదేమిటంటే.. సినిమాలో ‘డబుల్ స్పెషల్ సాంగ్స్’ అట. సినిమాలో మామూలుగా సింగిల్ స్పెషల్ సాంగ్ ఉంటుంది. అయితే సరిలేరులో మాత్రం.. కాస్త వెరైటీగా మాకెవ్వరు సరిలేరన్నట్లుగా ఫస్టాప్‌లో ఒక సాంగ్.. సెకండాఫ్‌లో ఓ స్పెషల్ సాంగ్‌ను దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారట. ఇదే నిజమైతే మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అన్న మాట.
ఇదిలా ఉంటే.. స్పెషల్ సాంగ్‌లో మిల్క్ బ్యూటీ తమన్నా మెరవనుందన్న సంగతి తెలిసిందే. అయితే మరో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఆ సాంగ్‌కు నర్తించే ‘స్పెషల్ బ్యూటీ’ ఎవరనేది తెలియరాలేదు. అయితే ఈ సాంగ్ కూడా ‘రాములో రాములో..’ మాదిరిగా కాస్త నాటుగా ఉంటుందట. ఇదే నిజమైతే ఈ డబుల్ స్పెషల్ సాంగ్స్ సినిమాకు ఏ మాత్రం కలిసొస్తాయో..? అసలు ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే మరి.