నన్ను దోచుకుందువటే సినిమాలో చాలా డీసెంట్ గా ట్రెడిషనల్ గా కనిపించిన నభా నటేష్...రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ లో అందాల ఆరబోతలో రచ్చ రచ్చ చేసింది. పిచ్చెక్కించే అందాలతో.. రామ్ సరసన తెలంగాణ యాసతో అదరగొట్టేసింది. సాంగ్స్ లోను రెచ్చిపోయి గ్లామర్ షో చేసిన నభా ఇప్పుడు డిస్కో రాజా సినిమా షూటింగ్ తో బిజీగా వుంది. అయితే ఇస్మార్ట్ తర్వాత నభాకి అవకాశాలొచ్చేస్తాయనుకున్నప్పటికీ... ఓ అన్నంతగా ఏం రాలేదు. అయితే ఇండస్ట్రీలో హిట్స్ కోసం తహతహలాడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభాకి ఓ ఛాన్స్ వచ్చింది.
బెల్లంకొండ సరసన అంటే పారితోషకం గట్టిగా ఉంటుంది అనుకుని ఓకే చెప్పిన నభా ఇప్పుడు శ్రీనివాస్ సినిమాలో చేయాలో వద్దో అనే డైలమాలో పడినట్లుగా వార్తలొస్తున్నాయి. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథలో నభా నటేశ తన పాత్ర కాస్త పెంచితే బావుంటుందని... మరీ గ్లామర్ లేకుండా కాస్త నటనకు ప్రాధాన్యత ఉంటే బావుంటుంది అని చెప్పగా.. దానికి సంతోష్ శ్రీనివాస్ మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పరిధి ఇంతే ఉంటుంది దాన్ని మార్చడం కుదరదని చెప్పగా.. దానితో నభా సరే నేను అలోచించి చెప్తా.. ఈసినిమా చెయ్యాలా వద్ద అని చెప్పి సంతోష్ శ్రీనివాస్ ని హోల్డ్ లో పెట్టినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.