Advertisementt

దర్శకులపై మోహన్ బాబు అసహనం.. ఎందుకిలా!?

Tue 12th Nov 2019 10:52 PM
collection king,manchu mohan babu,sensational comments,tollywood directors  దర్శకులపై మోహన్ బాబు అసహనం.. ఎందుకిలా!?
Mohan Babu Sensational Comments On Tollywood Directors! దర్శకులపై మోహన్ బాబు అసహనం.. ఎందుకిలా!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈయన ఏ పని చేసినా.. ఏం మాట్లాడినా వెరైటీనే..? ఈయన ఇంటర్వ్యూకు వచ్చినా.. ఆయనంతకు ఆయనే మీడియా ముందుకు వచ్చినా ఇక ఆ రోజు ఎవరో ఒకరిమీద సంచలన వ్యాఖ్యలే.. ఏదో ఒక వివాదాస్పద, షాకింగ్ కామెంట్స్ చేయనిదే ముగింపు పలకరు.!. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన టాలీవుడ్ డైరెక్టర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదండోయ్.. ఛీ అంటూ అసహ్యించుకుంటూ మాట్లాడేశారు!. అసలు కలెక్షన్ కింగ్‌కు ఎందుకింత ఫ్రస్టేషనో.. ఎందుకిలా మాట్లాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ఈ మధ్య ఎందుకు మీరెందుకు సినిమాల్లో అస్సలు కనిపించట్లేదు..? అనే ప్రశ్న ఎదురవ్వగా.. కలెక్షన్ కింగ్ చాలా లాజిక్‌గా.. సెటైరికల్‌గా సమాధానమిచ్చారు.  ఇప్పుడు నాకు అవకాశాలు ఇవ్వండంటూ దర్శకులను అడగాలా..? లేదంటే వాళ్లకు ఏమైనా మందు పార్టీలు ఇవ్వాలా..?. అంత ఖర్మ నాకేం పట్టలేదు.. అంతేకాదు ఆ అవసరం కూడా నాకు లేదు. ఆఫర్ల కోసం ముంబై, ఢిల్లీ విలాసాల కోసం తిరగను.. తిరగలేను. నాకు తెలిసింది కెమెరా ముందు నటించడం మాత్రమే. అసలు ఈ తరం దర్శకులు నన్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్థం కావట్లేదు. ఫలానా పాత్ర చేయండి.. అని నన్ను ఒక్కరంటే ఒక్కరూ సంప్రదించడంలేదు. బహుశా మోహన్ బాబు పేరుకు ఉన్న భయమే వాళ్లను నా దగ్గరికి రానీకుండా చేస్తుందేమో..?అని మంచు హీరో చెప్పుకొచ్చారు. ఈయన చేసిన వ్యాఖ్యలకు సీనియర్, జూనియర్ డైరెక్టర్స్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి మరి.

వాస్తవానికి మోహన్‌బాబుకు సినిమాల్లో నటించే బతకాలని లేదు.. ఎందుకంటే ఆయనుకున్న ఆస్తులు అన్నీ ఇన్నీ కావు. అంతేకాదు ‘విద్యానికేతన్’ విద్యాసంస్థలు ఈయనవే అన్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇక శాశ్వతంగా నటనకు కూడా దూరంగా ఉండిపోతారేమో. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే సీనియర్ అయిన కలెక్షన్ కింగ్‌కు ఇంతవరకూ ఏ పదవీ ఇవ్వని జగన్.. త్వరలోనే రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే ఇక సినిమాల్లో మోహన్ బాబు నటించరేమో.

Mohan Babu Sensational Comments On Tollywood Directors!:

Mohan Babu Sensational Comments On Tollywood Directors!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ