Advertisementt

నాకేం కాలేదు.. కంగారుపడొద్దు: డా.రాజశేఖర్

Thu 14th Nov 2019 01:04 AM
rajasekhar,an accident,injury,dr rajasekhar,golkonda appa junction  నాకేం కాలేదు.. కంగారుపడొద్దు: డా.రాజశేఖర్
I have not sustained any injury: Dr. Rajasekhar నాకేం కాలేదు.. కంగారుపడొద్దు: డా.రాజశేఖర్
Advertisement
Ads by CJ

హీరో రాజశేఖర్ కారు యాక్సిడెంట్‌కి గురైంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి రాజశేఖర్ ఇంటికి వెళుతుండగా రాజశేఖర్ కారు పల్టీలు కొట్టడంతో... ఆయనకు తీవ్ర గాయాలైనట్టుగా వార్తలొచ్చాయి. రాజశేఖర్ డ్రైవ్ చేస్తుండగా.. కారు మూడు పల్టీలు కొట్టడంతో... కారు ఎదర భాగం నుజ్జు నుజ్జు అవడంతో.. రాజశేఖర్‌కి గాయాలైనాయని మీడియాలో వార్తలు రావడంతో అందరూ షాకయ్యారు. రాజశేఖర్ కారుకి ప్రమాదం, ఆయనకు గాయాలు, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రాజశేఖర్ అని మీడియాలో వార్తలు చూసిన ఆయన అభిమానులు షాకవ్వడం జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగింది నిజమే కానీ, తనకు మాత్రం ఏమీ కాలేదని హీరో రాజశేఖర్ మీడియాకు తెలిపారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.

రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్‌లో నుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు.. అభిమానులు కంగారు పడొద్దు’’ అని అన్నారు.

I have not sustained any injury: Dr. Rajasekhar:

>Rajasekhar Met With An Accident

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ