Advertisementt

TUWJకు అనుబంధంగా FCA

Fri 15th Nov 2019 02:04 PM
film critics association,one more decision,tuwj,fca  TUWJకు అనుబంధంగా FCA
Film Critics Association Takes One More decision TUWJకు అనుబంధంగా FCA
Advertisement
Ads by CJ
  • టి.యు.డబ్య్లుజేకు అనుబంధంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్
  • విరాహత్ అలీతో సురేష్ కొండేటి, ఇ. జనార్దన్ రెడ్డి భేటీ

 ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఎ.పి.యు.డబ్ల్యు.జె.కు అనుబంధంగా సేవలందించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ.) ఇప్పుడు టి.యు.డబ్ల్యు.జె.కు అనుబంధంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఈ అసోసియేషన్ కొత్తగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దన్ రెడ్డి, వ్యవస్థాపక సభ్యులు కె.లక్ష్మణ్ రావులు ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ కార్యాలయంలో టీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీని కలుసుకొని లిఖితపూర్వకంగా తమ నిర్ణయ పత్రాన్ని అందించారు. 

తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వర్తించుకునేందుకు వీలుగా గతంలో మాదిరిగానే ఓ గదిని కూడా కేటాయించాలని, అక్కడ తమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ బోర్డును పెట్టుకునే వీలును కల్పించాలని కోరారు. ఇక నుంచి బషీర్‌బాగ్‌లోని తమ పాత కార్యాలయం నుంచే కార్యకలాపాలను నిర్వహించాలనుకుంటున్నట్లు ఎఫ్.సి.ఎ. నేతలు ప్రకటించారు. త్వరలో టి.యు.డబ్ల్యు.జె. సలహాలు, సంప్రదింపులతో తమ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కార్యవర్గంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Film Critics Association Takes One More decision:

FCA Members meets TUWJ

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ