Advertisementt

ఆయమన్న సినిమానే రావడం లేదుగా?

Fri 15th Nov 2019 07:20 PM
tollywood box office,dull,tenali ramakrishna babl,tollywood,movies  ఆయమన్న సినిమానే రావడం లేదుగా?
Tollywood Box Office Very Dull ఆయమన్న సినిమానే రావడం లేదుగా?
Advertisement
Ads by CJ

గత రెండు వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ బోర్ కొట్టిస్తుంది. ఖైదీ, విజిల్ సినిమాల తర్వాత మీకు మాత్రమే చెప్తా, తిప్పరా మీసం సినిమాల మీద కాస్త క్రేజ్ ఉన్నప్పటికీ, ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలయ్యాయి. తాజాగా ఈ శుక్రవారం ఏమైనా బాక్సాఫీస్‌లు కళకళలాడుతుందా అంటే అదీ లేదు. ఉసూరుమంటూ రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణుడు, విశాల్ యాక్షన్, మరో డబ్బింగ్ మూవీ విజయ్ సేతుపతి. మూడు సినిమాల మీద ప్రేక్షకులకు ఏమంత ఇంట్రెస్ట్ కనిపించడం లేదు.

తమిళ డబ్బింగ్ ఖైదీ సినిమా తర్వాత బాక్సాఫీసు బాగా డల్ అయ్యింది. మీకు మాత్రమే చెప్తా హిట్ అవుతుందనుకుంటే.. ఆ సినిమా పరమ బోర్ కొట్టించింది. ఇక తిప్పరా మీసం మీద ఆశలు పెట్టుకుంటే.. అదీ బోర్ కొట్టించింది. మరి ఈ నెలంతా పరమ బోర్ కొట్టే సినిమాలు తప్ప మరేం కనిపించడం లేదు. నవంబర్ మొదలైంది మొదలు ఆయమన్న సినిమా ఏదన్నా బాక్సాఫీసుని షేక్ చేసిందా అంటే ఏదీ లేదు. కనీసం వచ్చే సినిమాలన్నా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగిస్తాయా..? అర్జున్ సురవరం లాంటి సినిమా కూడా అంచనాలు లేకుండా వస్తుంది. మరి డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ కి విడుదలకాబోతున్న సినిమాల వరకు ఈ బాక్సాఫీస్ తిప్పలు ప్రేక్షకులకు తప్పేలా లేవు. 

Tollywood Box Office Very Dull :

No Attractive Movie at Tollywood Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ