Advertisementt

‘తెనాలి రామకృష్ణ’తో ఎంజాయ్ చేస్తున్నారంట!

Sat 16th Nov 2019 02:15 PM
sundeep kishna,tenali ramakrishna babl,team,response,movie,result  ‘తెనాలి రామకృష్ణ’తో ఎంజాయ్ చేస్తున్నారంట!
Sundeep Kishna about Tenali Ramakrishna BABL Response ‘తెనాలి రామకృష్ణ’తో ఎంజాయ్ చేస్తున్నారంట!
Advertisement
Ads by CJ

తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ చిత్రాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు - సందీప్ కిషన్

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా, స్టన్నింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్ గా, జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ’. ఈ చిత్రం నవంబర్15న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు జీ.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. మా సినిమాను చూడ్డానికి థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్న అందరికి థాంక్స్. నవ్వించడానికి మేము సినిమా తీశాము ఆడియన్స్ అదే చేస్తున్నారు. సినిమాలో కామెడీ ఉంది, మ్యూజిక్ బాగుంది, ట్విస్ట్ లు బాగున్నాయని అంటున్నారు మాకు అదే చాలు. రెస్పాన్స్ బాగుంది. నా సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కు ధన్యవాదాలు, సినిమాకు వచ్చే రెస్పాన్స్ తో మా యూనిట్ సభ్యులు అందరూ హ్యాపీగా ఉన్నారని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ... సినిమాకు మార్నింగ్ నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్, తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ చిత్రంలో నటించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ కు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

ఎడిటర్ చోటా కె ప్రసాద్ మాట్లాడుతూ.. మార్నింగ్ నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. చాలా మంది కాల్స్ చేసి చెబుతున్నారు. మేము హిట్ కొట్టామని గర్వాంగా చెబుతున్నాను, మా సినిమాను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. మేము ఈ సినిమా నవ్వించానికి తీసామని ముందు నుండే చెబుతూ వస్తున్నాను. రివ్యూస్ ను స్వాగతిస్తున్నాను. నాకు  వచ్చే కాల్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఆడియన్స్ ను నవ్విస్తుందని. బోర్ కొట్టకుండా సినిమా ఉందని అంటున్నారు. ప్రతి షోకు జనాలు పెరుగుతున్నారు, ఆ విషయం మమ్మల్ని సంతోష పెట్టింది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు, ఆడియన్స్ ఈ సినిమాలో చాలా ఎపిసోడ్స్ లో నవ్వుతున్నారని తెలిపారు.

నిర్మాత సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ... సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలో కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ నుండి థియేటర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మా సినిమాను ఇంతటి సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sundeep Kishna about Tenali Ramakrishna BABL Response:

Tenali Ramakrishna BABL Team Response on Movie Result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ