‘సోలో బ్రతుకే సో బెటర్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.. మే 1న విడుదల
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. పక్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేసి మే 1, 2020లో సినిమాను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
సాయితేజ్, నభా నటేశ్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సుబ్బు
నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్
పి.ఆర్.ఒ: వంశీ కాకా