Advertisementt

‘జార్జ్ రెడ్డి’ అంచనాలను అందుకుంటాడు: నిర్మాతలు

Wed 20th Nov 2019 09:27 PM
george reddy,producers interview,appireddy,damodar reddy,sanjay reddy,george reddy movie  ‘జార్జ్ రెడ్డి’ అంచనాలను అందుకుంటాడు: నిర్మాతలు
Producers Talks About George Reddy Movie ‘జార్జ్ రెడ్డి’ అంచనాలను అందుకుంటాడు: నిర్మాతలు
Advertisement
Ads by CJ

‘జార్జ్ రెడ్డి’ కథ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది- నిర్మాతలు అప్పిరెడ్డి, దామోదర్ రెడ్డి, సంజయ్ రెడ్డి

సందీప్ మాధవ్(సాండి) లీడ్ రోల్‌లో నటించిన మూవీ ‘జార్జ్ రెడ్డి’. విడుదలకు ముందే అంచనాలు పెంచిన ఈ ‘జార్జ్ రెడ్డి’ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా జర్నీని మీడియా సమావేశంలో పంచుకున్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, దామోదర రెడ్డి, సంజయ్ రెడ్డి.

ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మైక్ టివి ద్వారా ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాం. ఒకసారి దామోదర్ రెడ్డి, జీవన్ రెడ్డి‌లు జార్జిరెడ్డి కథ గురించి చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా జార్జిరెడ్డి కథలో ప్రత్యేకత నన్ను ఆకర్షించింది. అందుకే మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా ఖర్చు పెట్టాం. ఉస్మానియా సెట్‌ను నిర్మించాం.. ఆ టైం ని తెరమీదకు తీసుకొచ్చేందుకు చాలా రీసెర్చ్ చేసాం. ఇప్పుడు మా అంచనాలను మించి జార్జిరెడ్డి‌కి వస్తున్న స్పందన మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. డైరెక్టర్ జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సినిమాటోగ్రఫర్ సుధాకర్ రెడ్డిలు ఈ సినిమాకోసం చాలా రీసెర్చ్ చేసారు. జార్జ్ రెడ్డి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. ఈ కథ తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ‘జార్జ్ రెడ్డి’ అందరి అంచనాలను అందుకుంటాడనే నమ్మకం ఉంది’’ అన్నారు.

దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దళం తర్వాత జీవన్ ఉస్మానియాలో 5 నెలలు ఈ కథ రీసెర్చ్ కోసం గడిపాడు. ‘జార్జ్ రెడ్డి’ ప్రెండ్స్ అందరినీ కలిసాడు. అతని గురించి విన్నప్పడు ఒక కమర్షియల్ హీరోకి ఉండే ఎలిమెంట్స్ అన్నీ కనిపించాయి. ఒక మేథావి, ఫైటర్, అన్యాయాలను ఎదుర్కోవడంలో ముందుండే లక్షణం ఇవన్నీ కూడా ఒక హీరో ఇమేజ్ కుండే లక్షణాలే. అందుకే ‘జార్జ్ రెడ్డి’ కథకు హీరోలు అవసరం లేదు, ఆ కథలోనే హీరోయిజం ఉంది అనిపించింది. అందుకే ఇమేజ్ ఉన్న హీరోల కోసం ప్రయత్నించలేదు. ఏదైనా ఉద్యమం లో గానీ, ఆర్గనేజేషన్‌లోగానీ మంచి చెడులు ఉంటాయి. వాటని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేసాం అంతే కానీ ఎవర్నీ హీరోలను, విలన్లుగా చూపించలేదు. జార్జిరెడ్డితో ఈ తరం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఆ నమ్మకం మాకు ఉంది. ఉస్మానియా సెట్ నుండి జూనియర్ ఆర్టిస్ట్‌ల క్యాస్టూమ్స్ వరకూ ప్రతిదీ డిటైల్డ్ గా వర్క్ చేసాం. ఆ క్వాలిటీ మీకు తెరమీద కనిపిస్తుంది. ఉస్మానియా క్యాంపస్ లో జరిగిన సంఘటలను ఆసక్తిగా ఉంటాయి. ఈ జర్నీలో సినిమాటోగ్రర్ సుధాకర్ యెక్కంటి సహకారం మరువలేనిది. తను బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్నా కానీ.. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈ సినిమాను తన బేబిగా తీర్చిదిద్దారు’’ అన్నారు.

సంజయ్ రెడ్డి మాట్లాడతూ.. ‘‘ఈ సినిమా గురించి అప్పిరెడ్డిని కలసినప్పుడు తెలిసింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసాను. జీవన్, దామోదర్, సుధాకర్‌ల మాటలలో

సినిమాపై ఒక ప్యాషన్ కనపడింది అందుకే నిర్మాణ భాగస్వామిగా జాయిన్ అయ్యాను. ట్రైలర్‌తో జార్జిరెడ్డి ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేసాడు. పరిశ్రమ మొత్తం జార్జిరెడ్డిని స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ కొత్త కథలకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్ చాలా ఆరోగ్యకరంగా ఉంది. మెగా ఫ్యామిలీ ‘జార్జ్ రెడ్డి’కి పెద్ద సపోర్ట్‌గా నిలిచింది. నాగబాబుగారు, చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్‌గారు ఈ సినిమాకి చాలా మోరల్ సపోర్ట్‌గా నిలిచారు. సినిమా తప్పకుండా ఒక ప్రత్యేకమైన ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు అందిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ప్రివ్యూలకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. షోస్ డిమాండ్‌ని బట్టి పెరుగుతున్నాయి. ‘జార్జ్ రెడ్డి’ సినిమా పై పెరుగుతున్న అంచనాలను తప్పకుండా అందుకుంటాడు..’’ అన్నారు.

‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీమంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, మహాతి ఇతర నటీనటులు.

Producers Talks About George Reddy Movie:

George Reddy Movie Producers interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ