Advertisementt

‘రాగల 24 గంటల్లో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్!

Thu 21st Nov 2019 10:18 PM
raagala 24 gantallo,movie,pre release,event,highlights  ‘రాగల 24 గంటల్లో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్!
Raagala 24 Gantallo Movie Pre Release Event Highlights ‘రాగల 24 గంటల్లో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్!
Advertisement
Ads by CJ

ఇషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన సినిమా రాగల 24 గంటల్లో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది..

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా మీడియా సోదరులకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన పేరుపేరునా నమస్కారాలు. నిర్మాత గారి మాటల్లోనే చూడొచ్చు. ఆయన ఓ దమ్మున్న ప్రొడ్యూసర్. సినిమా అనేది ఎంతపెడితే ఎంత వస్తుంది.. అని లెక్కలు వేసుకుని.. బడ్జెట్ ఎలా కంట్రోల్ చేయాలి. ఇలానే తీయాలి ఇంతలోనే తీయాలి అనుకుంటారు. అది వ్యాపారం కాబట్టి అందులో తప్పులేదు. కానీ మా నిర్మాత కానూరి శ్రీనివాస్ అన్న ప్యాషన్‌తో వచ్చాడు. మంచి సినిమా చేయాలి అని వచ్చాడు. అద్భుతమైన సినిమా చేసాం. ఆయన మాటల్లోనే కాన్ఫిడెన్స్ లెవల్స్ తెలుస్తుంది. నవంబర్ 22న మీకు తెలుస్తుంది. నా గత సినిమాల మాదిరే మరో హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా వెలుగొందుతానని నమ్ముతున్నాను. మా నిర్మాత లాంటి వాళ్లు చాలా రేర్‌గా ఉంటారు. ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు వెనక నుంచి చెడుచేసే పర్సన్స్ కూడా ఉంటారు. అన్నయ్య విజయం వెనక మాత్రం వదిన ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత బంధు మిత్రలుతో పాటు తల్లిదండ్రులు కూడా మా కానూరి శ్రీనివాస్ గొప్ప సినిమా చేసాడని చెప్పుకుంటారు. ఎక్కడైనా సక్సెస్ అనేది ఇంపార్టెంట్. 360 డిగ్రీస్‌లో ఎవరూ కనిపించరు. కానీ నేనున్న ఈ స్థితిలో.. ఢమరుకం తర్వాత నేనున్న స్థితిలో నేను పడుతున్న స్ట్రగుల్స్ అన్ని చూసి మాటిచ్చి.. మాట కోసం ఈ చిత్రం తీసారు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చి.. పక్కనుండి నడిపిస్తున్నారు. ప్రతీ విషయంలో నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను బతికున్నంత వరకు ఆయన్ని మాత్రం నేను వదలను. మళ్లీ నాకు ఓ మార్గాన్ని చూపించారు. చాలా థ్యాంక్స్ అన్నా. సినిమా గురించి చెప్పాలంటే మేం చేసినటువంటి రాగల 24 గంటల్లో సినిమా కచ్చితంగా నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుంది. తమ సినిమా గురించి ఎవరికి వాళ్లు అలాగే చెప్పుకున్నా కూడా నిజంగానే మంచి సినిమా చేసాం. ఈ సినిమాకు మంచి ఆర్టిస్టులు దొరికారు. సినిమాలో నటించిన వాళ్లందరికీ థ్యాంక్స్. సత్యదేవ్ నిజంగా గొప్పనటుడు. హీరోయిన్ కోసం చాలా మందిని అనుకుంటున్న తరుణంలో అ.. సినిమా చూసాను. ఈ సినిమాలో అమాయకంగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ చేయాలి. అలాంటి కారెక్టర్‌కు ఇషా రెబ్బా అయితే పర్ఫెక్ట్ అనిపించి పెట్టుకున్నాను. చాలా మంది తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలనుకుని తీసుకున్నాను. ఇషా రెబ్బా కూడా చాలా అద్భుతంగా చేసింది. ఈ సినిమా తర్వాత నయనతార, అనుష్క లాంటి అందమైన తెలుగు హీరోయిన్ వచ్చింది అనుకుంటారు. శ్రీరామ్ గారు కూడా అద్భుతంగా నటించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసాడు. మిగిలిన వాళ్లు కూడా అంతా బాగా చేసారు అని తెలిపారు.

హీరోయిన్ ఇషా రెబ్బా మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ తెలుగుమ్మాయికి హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు రావడం చాలా అదృష్టం కావాలి. అనుష్క, నయనతార లాంటి వాళ్ల డేట్స్ దొరక్క నా దగ్గరికి వచ్చారని చెప్పారు. నన్ను ఈ పాత్రలో తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నిజంగానే తెలుగమ్మాయిలకు ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. మీ లాంటి దర్శకులు ఉన్నారు కాబట్టే ఇంకా మేం ఉన్నాం ఇండస్ట్రీలో. శ్రీనివాస్ రెడ్డి గారూ కామెడీ సినిమాలు చేసారు కదా.. సస్పెన్స్ ఎలా చేసారని చాలా మంది నన్ను అడిగారు. కానీ ఆయన అలాంటి ఒకే జోనర్ దర్శకుడు కాదు. ఢమరుకం చేసారాయన. మాకు కూడా కథ చెప్పినపుడు కానీ సెట్లో కానీ ఎక్కడా కామెడీ చేసినట్లు అనిపించలేదు. పైగా ఆయన ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ షూట్ చేసినా.. రాత్రి 2 గంటలకు షూట్ చేసినా కూడా ప్రశాంతంగా కనిపించారు. సినిమాలో అంతా బాగా నటించారు. సత్యదేవ్ కూడా అద్భుతంగా నటించాడు. కాంపిటీటివ్‌గా అనిపించాడు. ఈయన తెలుగు ఇండస్ట్రీలో విక్కీ కౌశల్. మంచి ఆఫర్ వస్తే రేంజ్ మారిపోతుంది. సినిమాలో నటించిన వాళ్లందరికీ థ్యాంక్స్. సంగీతం రఘుకుంచె గారు చాలా బాగా చేసారు. ఆర్ఆర్ చాలా బాగా వచ్చింది. ఇలాంటి చిత్ర యూనిట్‌తో పని చేయడం అద్భుతంగా అనిపించింది అని తెలిపారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. నేను సాధారణంగా లాస్ట్‌లో మాట్లాడుకుంటాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడటానికి పాయింట్స్ తీసుకోవచ్చని. కానీ ఇప్పుడు మాత్రం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడొద్దని ఫిక్సైపోయాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఇంకేం ఉండదు. రాగల 24 గంటల్లో సినిమా గురించి చెప్పాలంటే.. కథ విన్న తర్వాత భయపడ్డాను. రాహుల్ అనే పాత్ర చేయడానికి భయపడ్డాను. 100 పర్సెంట్ ఇవ్వగలనా లేదా అని భయపడ్డాను. ఈ కారెక్టర్ తీసుకోవడానికి ప్రధాన కారణం రాసిన విధానం. వీళ్లంతా నన్నంతా బాగా పొగిడేసరికి హ్యాపీ అనిపించింది కానీ ఒక్క విషయం చెప్పాలి. స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ అన్నారు కానీ కథ కూడా అద్భుతంగా ఉంది. కారెక్టరైజేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. నాది, ఇషా, శ్రీరామ్, రవి అంతా అద్భుతమైన కారెక్టర్స్ ఉన్నాయి. ఓ ఏడాది కష్టపడి స్క్రిప్ట్ రైటర్స్ అంతా కష్టపడి రాసినప్పుడు మేం ఈజీగా విని కథ సెలెక్ట్ చేసుకుంటాం. నిర్మాత కానూరి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ అంజి ఆయనకు కుడికన్ను. థ్రిల్లర్ సినిమాలకు డిఓపి ముఖ్యం. రవన్న నాకు ఓ విషయం చెప్పాడు. ఫస్ట్ సీన్ నుంచి థ్రిల్లర్స్ అనేది ఎంగేజ్ చేయాలి. ఇంత మంచి కథ రాసి స్క్రీన్ ప్లే రాసినందుకు థ్యాంక్స్. వాసన్న నీ మంచితనం ఇండియన్ గవర్నమెంట్ చూస్తే అవార్డు ఇస్తారు. అంత జెన్యూన్ పర్సన్‌ను నేనెప్పుడు కలవలేదు. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ ఆయన. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇక దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా కూల్. వీళ్లిద్దరి గురించి సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. అలాగే అద్భుతమైన కథ కూడా ఉంది అని తెలిపారు.

నిర్మాత కానూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్యదేవ్ చాలా అద్భుతమైన నటుడు. ఈయన చాలా సినిమాలు చేసాడు. కానీ సరైన సినిమా పడలేదు. బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమా ప్రీమియర్ చూసి అప్పుడే చెక్ ఇచ్చాం. మీ డేట్స్ ఎప్పుడిచ్చినా సినిమా చేస్తామని చెప్పాం. ఇక హీరోయిన్ వేట మాత్రం చాలా వరకు సాగింది. అనుష్క, కాజల్, రెజీనా లాంటి చాలా మంది నటీమణులు కథ విన్న తర్వాత డేట్స్ కుదరక చివరికి ఇషా రెబ్బా గారు వచ్చారు. తెలుగందంతో పని చేసామని గర్వంగా చెబుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె గారు అద్భుతంగా సంగీతం అందించారు. నా సినిమా గురించి గర్వంగా చెప్పుకుంటాను. నేనో మంచి సినిమా తీసాను. అందరూ చూడండి. శుక్ర, శనివారాలు తలా ఒక్కరు 100 టికెట్స్ కొని సాయం చేయండి. నవంబర్ 22న రెండు సినిమాలే ఉన్నాయనుకుని ప్లాన్ చేసాను. కానీ 10 సినిమాలు వస్తున్నాయి. అయినా కూడా రేటింగ్స్ విషయంలో కూడా నా సినిమా ముందే ఉంటుంది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేసారు. ఆయన గురించి నాకు తెలుసు. మంచి పనితనం ఉన్న మనిషి. రాగల 24 గంటల్లో కచ్చితంగా 2019లో ఓ అద్భుతమైన సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. అని తెలిపారు.

Raagala 24 Gantallo Movie Pre Release Event Highlights:

Celebrities Speech at Raagala 24 Gantallo Movie Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ