ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలో ‘జై’ పాత్రలో నత్తినత్తిగా మాట్లాడి.. పవర్ ఫుల్ నటనతో అదరగొట్టేసాడు. పాత్ర పవర్ ఫుల్ అయినా... మాటలో తడబాటుతో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. అయితే అప్పట్లో పూరి జగన్నాధ్ ఓ కథ ఎన్టీఆర్ కి చెప్పగా ఆ కథలో హీరో పాత్రకి నత్తి ఉంటే.. కథ నచ్చకపోయినా.. హీరో పాత్ర కి ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యాడట. అయితే ఆ కథ మరుగున పడిపోవడం, ఎన్టీఆర్ జై లవకుశ లో నత్తి పాత్ర చెయ్యగా.. అప్పట్లో పూరి ఆ సినిమా చూసి షాకయినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఎన్టీఆర్ కి చెప్పిన కథనే చాలామంది హీరోలతో చెయ్యాలనుకుంటే.. ఎవరూ పూరికి అవకాశం ఇవ్వలేదు కానీ.. విజయ్ దేవరకొండ మాత్రం పూరి చెప్పిన స్టోరీ లైన్‌కి ఇంప్రెస్స్ అయ్యి ఆ కథకి కనెక్ట్ అవ్వడంతో.. పూరి - విజయ్ కాంబో పట్టాలెక్కింది.
అయితే ఫైటర్ గా విజయ్ దేవరకొండ పాత్ర పవర్ ఫుల్ గా ఉండడమే కాదు... సిక్స్ ప్యాక్ లుక్ లో నత్తినత్తిగా ఉండబోతుందని అంటున్నారు. మరి పూరి మార్క్ మాస్ ఎలెమెంట్స్ ఈ పాత్రకి పుష్కలంగా ఉండడంతో.. విజయ్ దేవరకొండ ఆ నత్తి పాత్రని ఒప్పుకున్నాడని అంటున్నారు. మరి ఎన్టీఆర్ అదరగొట్టిన నత్తి పాత్రని విజయ్ ఎలా హ్యాండిల్ చెయ్యబోతున్నాడో అనే క్యూరియాసిటీ విజయ్ అభిమానుల్లో ఏర్పడింది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ కీ రోల్ పోషించబోతుందని, అది కూడా విజయ్ దేవరకొండకి దిశానిర్దేశం చేసే కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందని.. ఆమె చెప్పే సూచనల్తోనే హీరో పాత్రధారి తన రూటు మార్చుకుని, మార్షల్ ఆర్ట్స్‌లో ఎదుగుతాడని.. కథ మొత్తం విజయ్, రమ్యకృష్ణల మీదే ఉండబోతుందని అంటున్నారు.