Advertisementt

మహేష్ రెమ్యూనరేషన్‌లో.. కటింగా...?

Sat 23rd Nov 2019 06:41 PM
mahesh babu,remuneration,decreased,sarileru neekevvaru  మహేష్ రెమ్యూనరేషన్‌లో.. కటింగా...?
Mahesh Remuneration for Sarileru Neekevvaru Movie మహేష్ రెమ్యూనరేషన్‌లో.. కటింగా...?
Advertisement
Ads by CJ

మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ కోసం మహేష్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు టీజర్ తో లెక్కలు అన్నిమార్చాలని మహేష్ ఫ్యాన్స్ ఎత్తుగడ వేశారు. అయితే టీజర్ వచ్చే లోపు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు మహేష్ పారితోషకంపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకి గాను అత్యధికంగా 50 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడని ప్రచారం జరిగింది. సినిమా బిజినెస్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ కింద వచ్చే మొత్తం సొమ్ముని మహేష్ పారితోషకం కింద ఇచ్చేలా అనిల్ సుంకర ఒప్పందం చేసుకున్నాడు.

మరి మహేష్ సూపర్ స్టార్ రేంజ్ కనక ఆయన సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఓ 50 కోట్లు రావడం పక్కా అనుకున్నారు. అయితే ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ సినిమాకి ఆశించినంత నాన్  థియేట్రికల్ హక్కుల రూపంలో రావడం లేదని, శాటిలైట్, డిజిటల్ హక్కులకు మంచి రేటు పలికినా హిందీ హక్కులకు అనుకున్న రేంజ్ ధర రాకపోవడంతో.. ఇప్పుడు మహేష్ కి ఇచ్చేదానిలో కొంత కోత తప్పదని అంటున్నారు. మరోపక్క నిర్మాతలకు బడ్జెట్ కూడా తడిసి మోపుడవుతుందని, అలా థియేట్రికల్ రైట్స్ కింద కూడా అంత పెద్ద మొత్తం రాదని, ఇంకా లాభాల్లో మహేష్ కి వాటా ఏం ఇస్తామని నిర్మాతలు ఇప్పుడు తర్జన భర్జనలు పడుతున్నట్టుగా ఫిలింనగర్ టాక్. ముందు సరిలేరుకి 50 కోట్ల బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు సెట్స్ గట్రా కాష్ట్లీగా వెయ్యడంతో.. బడ్జెట్ పరిధి దాటిపోవడంతో.. థియేట్రికల్ హక్కుల కింద్ వచ్చే మొత్తానికి  బడ్జెట్ కి సరిపోయేలా ఉందంటున్నారు.

Mahesh Remuneration for Sarileru Neekevvaru Movie:

Mahesh Babu Remuneration Decreased for Sarileru Neekevvaru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ