Advertisementt

‘అంజలి-జై’.. షాకింగ్ విషయం చెప్పిన నిర్మాత

Sat 23rd Nov 2019 06:56 PM
nandakumar,jai,anjali,relation,shocking comments,producer nandakumar  ‘అంజలి-జై’.. షాకింగ్ విషయం చెప్పిన నిర్మాత
Producer Nandakumar Shocking Comments on Jai and Anjali ‘అంజలి-జై’.. షాకింగ్ విషయం చెప్పిన నిర్మాత
Advertisement
Ads by CJ

తమిళనాట ‘జర్నీ’ సినిమాతో ప్రేమికులుగా మారిన అంజలి - హీరో జై గత ఏడాది బెలూన్ మూవీ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం జరిగింది. హీరో జై - అంజలి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనుకున్న తరుణంలో అంజలి - జై ఎవరికీ వారు దూరంగా ఉండేసరికి వారి మధ్యన విభేదాలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారని అన్నారు. అయితే తాజాగా ఓ తమిళ నిర్మాత అంజలి - జై లు తనని ఎలా మోసం చేసారో.. వారి మధ్యన ఉన్న బంధం ఎలాంటిదో చెప్పి అందరికి నోట మాట రాకుండా చేసాడు. అంజలి - జై లు నటించిన బెలూన్ సినిమా నిర్మాత నందకుమార్... అంజలి, జై ల వలన తనెంత నష్టపోయింది చెప్పి మీడియా ముందు భోరుమన్నారు.

జై వల్ల తాను చాలా డబ్బు పోగొట్టుకున్నా అని, అంజలి చాలా మంచి నటి అని, ఆమె కమిట్మెంట్ ఉన్న హీరోయిన్ అని చెప్పిన నందకుమార్,  జై వలన అంజలి గాడి తప్పిందని చెప్పి షాకిచ్చాడు. బెలూన్ సినిమా షూటింగ్ సమయంలో జై సినిమా షూటింగ్‌ని మాటిమాటికి డిస్ట్రబ్ చేస్తూ.. అంజలిని లొకేషన్‌కి రాకుండా చేసేవాడని, ఓసారి అంజలిని మేడం అని పిలవనందుకు జై రచ్చ రచ్చ చేసి.. షూటింగ్ ఆపేసాడని చెప్పిన బెలూన్ నిర్మాత, అంజలి కూడా జై చెప్పుడు మాటల వలన చెడిపోయిందని ఆరోపించాడు.

అంతేకాకుండా అంజలిని షూటింగ్ కి రాకుండా చేసి... ప్రొడక్షన్ కారులో ఎయిర్పోర్టు కి తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కి చెన్నై తీసుకెళ్లిపోయాడని, అలాగే సినిమా షూటింగ్ కోసం కొడైకెనాల్ లో అంజలి, జై కి రెండు రూమ్స్ బుక్ చేస్తే.. మాకు ఒకటి చాలని, ఒకే రూమ్ లో ఉంటామని చెప్పిన జై, రెండో రూమ్ ని క్యాన్సిల్ చెయ్యకుండా అడ్డుకున్నాడని, అతని వలన నేను చాలా నష్టపోయానంటూ వాపోతున్నాడు సదరు నిర్మాత నందకుమార్.

Producer Nandakumar Shocking Comments on Jai and Anjali:

Producer Nandakumar Talks about Jai and Anjali Relation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ