Advertisementt

మేం జబర్దస్త్‌లోనే ఉన్నాం: ఆది, అనసూయ

Mon 25th Nov 2019 04:32 PM
hyper aadi,anasuya,jabardasth,nagababu,clarity,zee telugu  మేం జబర్దస్త్‌లోనే ఉన్నాం: ఆది, అనసూయ
Hyper Aadi and Anasuya gives Clarity on Jabardasth మేం జబర్దస్త్‌లోనే ఉన్నాం: ఆది, అనసూయ
Advertisement
Ads by CJ

నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. అదే టైమ్‌లో జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్, ఎన్నెన్నో అనుకుంటాం.. అనే కామెడీ ప్రోగ్రామ్స్ ద్వారా మళ్లీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. అయితే నాగబాబుతో పాటుగా అనసూయ కూడా జబర్దస్త్ వదిలేస్తుంది.. అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనసూయ జీ ఛానల్ లో లోకల్ గ్యాంగ్స్, ఎన్నెన్నో అనుకుంటామనే కార్యక్రమాలలో డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి మెరవడంతో... అనసూయ కూడా జబర్దస్త్‌కి హ్యాండ్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది.

మరో పక్క నాగబాబు వీర విధేయుడు హైపర్ ఆది కూడా జబర్దస్త్‌ని వీడనున్నాడనే టాక్ మొదలైంది. ఇప్పటికే ఆది, నాగబాబుతో వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడని, కానీ జబర్దస్త్ నుండి ఆది వెళ్ళడానికి ఆయన టీం సభ్యులు కానీ, మల్లెమాల టీం కానీ ఒప్పుకోలేదని, లేదంటే ఆది ఎప్పుడో జంప్ అయ్యేవాడని అంటున్నారు. అయితే అటు అనసూయ, ఇటు ఆది కూడా తామింకా జబర్దస్త్‌లోనే ఉన్నామని, తాము చెప్పేవరకు తమ మీద వచ్చే రూమర్స్ నమ్మొద్దంటూ సోషల్ మీడియా వేదికగా వారిద్దరూ.. నాగబాబు వెళ్లినా మేం జబర్దస్త్‌లోనే ఉన్నామంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.

Hyper Aadi and Anasuya gives Clarity on Jabardasth:

Hyper Aadi and Anasuya in Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ