అవును మీరు వింటున్నది నిజమే.. నేను చేయనుగాక చేయను అని లేడీ అమితాబ్, ఒకప్పుడు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన సీనియర్ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ తేల్చి చెప్పిసిందట. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో దాదాపు ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే రాములమ్మకు బంపరాఫర్ వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనీల్ రావిపూడి చెప్పుకొచ్చారు. అయితే అనీలే స్వయంగా చెప్పాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో..? అసలు ఎందుకు రాములమ్మ నో చెప్పింది..? అనే విషయాలు అనిల్ మాటల్లోనే విందాం.
మాస్ మహారాజు రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. ఈ చిత్రంలో రవితేజ తల్లి పాత్రకి ఎవరైతే బాగుంటారని నిశితంగా పరిశీలించిన అనీల్.. ఫైనల్‌గా విజయశాంతి అయితే కరెక్టుగా సెట్ అవుతారని.. ఆమె ఒక్కరే ఆ పాత్రకు సరిగ్గా సెట్ అవుతారని భావించారట. ఈ క్రమంలో విజయశాంతిని సంప్రదించగా అబ్బే నేను చేయట్లేదు.. అని సింగిల్ మాటలోనే తేల్చి చెప్పిసింది. ఆమె నో చెప్పిన తర్వాతే అమ్మ పాత్రలో రాధికను తీసుకున్నట్లు దర్శకుడు చెప్పాడు. తదుపరి చిత్రానికైనా పక్కాగా తీసుకోవాలని ఆయన ఫిక్స్ అయ్యాడట.
ఆ తర్వాతే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్, రష్మిక మందన్నా నటీనటులుగా తెరెకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటించాలని సంప్రదించగా ఆమె.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అనీల్ చెప్పుకొచ్చాడు. అది కూడా కీలక పాత్ర, సినిమాకు ప్రధానపాత్ర కావడంతో... మహేశ్ సినిమా కావడంతో ఏ మాత్రం ఆలోచించకుండానే రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చారన్న మాట. అంతేకాదండోయ్.. ‘స్వాతిముత్యం’ లో సోమయాజులు చుట్టూ కమల్ తిరిగినట్టు తాను కూడా విజయశాంతి ఇంటి చుట్టూ తిరిగినానని అనీల్ చెప్పుకొచ్చాడే. సరిలేరు కథ చెప్పేటప్పుడు ఆమె కళ్లలో ఆనందం.. అసలు ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోకుండా చాలా క్యాజువల్‌గా.. నవ్వుతూ కథ విని ఓకే చెప్పారని అనీల్ చెప్పుకొచ్చాడు. సో.. రాజా ది గ్రేట్ పాత్రలో మిస్సయిన తల్లి.. సరిలేరులో ప్రత్యక్షమైందన్న మాట. మరి ఈ పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ ఏ మాత్రం మెప్పిస్తుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే మరి.