Advertisementt

తనతో సినిమాకి.. శ్రీవిష్ణు కండీషన్లు ఇవే!

Wed 27th Nov 2019 04:31 PM
sree vishnu,budjet,movies,conditions,producers,directors,srivishnu  తనతో సినిమాకి.. శ్రీవిష్ణు కండీషన్లు ఇవే!
Hero Sree Vishnu Conditions to Producers and Directors తనతో సినిమాకి.. శ్రీవిష్ణు కండీషన్లు ఇవే!
Advertisement
Ads by CJ

నారా రోహిత్ ఫ్రెండ్ గా సినిమాల్లోకి వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు హీరోగా మారి... తనకంటూ ఓ రేంజ్ ఉందిగా అనే లెవల్ కి పెరిగాడు. నీది నాది ఒకటే కథ, బ్రోచేవారెవరూ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో హీరోగా నిలబడిన శ్రీ విష్ణుకి తిప్పరా మీసం పోయినా.. పెద్దగా విష్ణు క్రేజ్ తగ్గలేదు. చిన్న నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన శ్రీ విష్ణుతో నాలుగైదు కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తే.. శాటిలైట్, థియేట్రికల్ హక్కుల కింద లాభాలు గ్యారెంటి అన్న రేంజ్ లోకి శ్రీ విష్ణు వెళ్ళిపోయాడు. తిప్పరా మీసం హిట్ అయితే.. విష్ణు మార్కెట్ మరింతగా పెరిగేది.

అయితే తాజాగా తన దగ్గరకొస్తున్న దర్శక నిర్మాతలకు శ్రీ విష్ణు ఒకటే చెబుతున్నాడట. అది తన పారితోషకం పెంచమని కాదు.... కథ మినిమమ్ 7 నుండి 8 కోట్ల బడ్జెట్ ఉన్నది ఉండాలని. అలా పెట్టుబడి పెట్టి సినిమా చేసే వాళ్ళే తన దగ్గరకి రావాలని చెబుతున్నాడట. ప్రస్తుతం ప్ర‌దీప్ వ‌ర్మ అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన పోలీస్ కథని ఓకే చేసిన శ్రీ విష్ణుతో సినిమా చెయ్యడానికి ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వెంటపడుతున్నారట. అయితే తనతో సినిమా చెయ్యాలంటే 7 నుండి 8 కోట్లు పెట్టాలి.. కాదు 4 మూడు కోట్లలో సినిమా చేసెయ్యాలంటే కుదరదని, 8 కోట్లకి సెట్ అయితే.. అందులోనే తాను ప్రమోషన్స్ కూడా చేసి సినిమాకి క్రేజ్ తెస్తానని నిర్మాతలకు హామీ కూడా ఇస్తున్నాడట విష్ణు. అయితే ఒకేసారి శ్రీ విష్ణు మీద డబుల్ బడ్జెట్ పెట్టాలంటే కష్టం అంటున్నారట సదరు నిర్మాతలు.

Hero Sree Vishnu Conditions to Producers and Directors:

Sree Vishnu Declares Budjet for His Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ