Advertisementt

ఈసారి అల్లు అర్జున్‌కి పోటీగా మహేష్..!

Wed 27th Nov 2019 09:31 PM
ala vaikunthapurramloo,teaser,sarileru neekevvaru,single,release,december 1  ఈసారి అల్లు అర్జున్‌కి పోటీగా మహేష్..!
Mahesh Babu Targets Allu Arjun ఈసారి అల్లు అర్జున్‌కి పోటీగా మహేష్..!
Advertisement
Ads by CJ

 

 

 

నిన్నమొన్నటివరకు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని వదులుతూ మార్కెట్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ కి ఇప్పుడు చుక్కలు కనబడేలా మరో స్టార్ హీరో మహేష్ ప్లాన్ చేసాడు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు సంక్రాంతికి పోటీ పడడంతో... ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం పక్కనబెడితే... మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా నిన్నటివరకు సూపర్ హిట్ సాంగ్స్ తో దుమ్ములేపగా.. మహేష్ మాత్రం సరిలేరు టీజర్ తో కూల్ గా వచ్చి అల వైకుంఠానికి చమట్లు పట్టించాడు. రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయిన సంతోషం సరిలేరు టీజర్ తర్వాత  అల్లు అర్జున్ మోహంలో కనబడకుండా పోయింది.

దానితో అల వైకుంఠపురములో టీజర్ తో ప్రేక్షకులను షేక్ చెయ్యాలని రంగం సిద్ధం చేస్తున్నారు త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్. అయితే ఇప్పటివరకు కూల్ గా ఉన్న మహేష్ మాత్రం ఈసారి అల్లు అర్జున్ కి చెక్ పెట్టడానికి రెడీ అయిపోతున్నాడు. అదేమిటంటే.. డిసెంబర్ 1 న అల వైకుంఠపురంలో టీజర్ విడుదల అనుకుంటుంటే.... అదే రోజు సరిలేరు నీకెవ్వరు సింగిల్ ని వదలడానికి మూవీ టీం రెడీగా వుంది. అసలే థమన్ మీద కసితో ఉన్న దేవిశ్రీ.. సరిలేరు మ్యూజిక్ ని అదరగొట్టాడని టాక్. మరి అల టీజర్, సరిలేరు సింగిల్ వెరసి మళ్ళీ ఆ హీరోల అభిమానుల మధ్యలో సెగ రాజేసినట్టే. 

Mahesh Babu Targets Allu Arjun:

Ala Vaikunthapurramloo Teaser vs Sarileru Neekevvaru Single

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ