Advertisementt

డిసెంబర్‌కి పోటీగా మారుతున్న ఫిబ్రవరి..!

Wed 27th Nov 2019 10:37 PM
top movies,released,december 19,february 2020  డిసెంబర్‌కి పోటీగా మారుతున్న ఫిబ్రవరి..!
December 19 and February 2020 Release Movies Details డిసెంబర్‌కి పోటీగా మారుతున్న ఫిబ్రవరి..!
Advertisement
Ads by CJ

జనవరి లో సంక్రాంతికి ముందు డిసెంబర్ చివరి వారంలో మీడియం రేంజ్ హీరోలంతా మీడియం బడ్జెట్ సినిమాలతో పోటాపోటికి దిగుతారు. డిసెంబర్ చేజారితే.. సంక్రాంతికి సాహసం చెయ్యకుండా ఫిబ్రవరికి వెళతారు కొంతమంది. సంక్రాంతి బరిలో పెద్ద హీరోలకు భయపడే హీరోలంతా ఫిబ్రవరి మొదటి, రెండో వారాలకి కర్చీఫ్ వేస్తారు. మరి డిసెంబర్ చివరిలో బాలకృష్ణ రూలర్, ప్రతి రోజు పండగే, డిస్కో రాజాలు దిగుతున్నాయి. మరి మూడు సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. ఇక నితిన్ భీష్మ కూడా డిసెంబర్ లోనే అన్నారు కానీ... చివరికి నితిన్ భీష్మ ఫిబ్రవరికి వెళ్ళిందిగా అంటున్నారు.

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ని హడావిడీ లేకుండా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున దింపుతున్నాడు. అదే రోజు నితిన్ భీష్మ, దిల్ రాజు 96 సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయంటూ కొత్త న్యూస్ వినబడుతుంది. ముందుగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ ని ఫిబ్రవరి 14 అనగానే... శర్వానంద్ - సమంత 96, నితిన్ భీష్మ లు అదే రోజు అవడానికి సిద్దమవుతున్నాయి. మరి విజయ్ కి క్రేజ్ ఉంది, 96 రీమేక్ అంటే మంచి అంచనాలున్న సినిమా, అలాగే భీష్మ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. మరి డిసెంబర్ చివరిలో సినిమాల సందడి ఎంతుందో... ఫిబ్రవరిలోను అంతే ఉంది. అయితే విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ ని వీటి మీద పోటీకి దింపకుండా డిసెంబర్ లోనే విడుదల చేసుంటే బావుండేది. కానీ విజయ్ మాత్రం తన సినిమాని ఫిబ్రవరికి తీసుకెళ్లాడు.  

December 19 and February 2020 Release Movies Details:

Top Movies Released in December 19 and February 2020 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ