Advertisementt

కంగనాని టార్గెట్ చేసిన నిత్యామీనన్..!

Thu 28th Nov 2019 06:57 PM
nithya menen,sensational comments,kangana ranaut,jayalalitha biopic  కంగనాని టార్గెట్ చేసిన నిత్యామీనన్..!
Nithya Menen Sensational Comments on Kangana Ranaut కంగనాని టార్గెట్ చేసిన నిత్యామీనన్..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో కంగనా అంటే ఫైర్ బ్రాండ్. కంగనాతో పెట్టుకోవాలంటే స్టార్ హీరోలే ఆలోచిస్తారు. తన ముందు టార్గెట్ ఎవరనేది కంగానా ఆలోచించదు. టాప్ హీరో అయినా, టాప్ దర్శకుడు అయినా, టాప్ నిర్మాత అయినా ఎవరిని కంగనా వదలదు. అలాంటి కంగానాతో ఇప్పుడొక సౌత్ హీరోయిన్ పెట్టుకుంది. ఆమె నిత్యా మీనన్. ఇంతకీ ఆ కథా కమామిషు ఏమిటంటే, కంగనా రనౌత్ తమిళనాట భారీ క్రేజ్ ఉన్న దివంగత జయలలిత బయోపిక్ తలైవిలో నటిస్తుంది. కె ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమ్మగా కంగనా లుక్ ఈ మధ్యనే రివీల్ అయ్యింది. ఇక నిత్యా మీనన్ కూడా జయలలిత బయోపిక్ ఐరన్ లేడిలో నటిస్తుంది.  ప్రియదర్శిని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నిత్యా మీనన్ జయలలితగా కనిపిస్తుంది.

అలాగే జయలలితపై మరో వెబ్ సీరీస్ కూడా తెరకెక్కుతుండగా.. ఈమధ్యనే కంగనా తలైవి లుక్ మీద నటి నిత్యా మీనన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కంగనా జయలలిత లుక్ లో చాలా మేకోవర్ అయ్యింది. అచ్చం అమ్మలా కనిపించడానికి గాని హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో కంగనా జయలలిత లుక్ లోకి మారడానికి చాలా శ్రమిచ్చింది. అయితే కంగనా జయలలిత లుక్ మీద ఇండైరెక్ట్ గా నిత్యా మీనన్... జయలలిత బయోపిక్ లో జయలలిత పాత్రకి తానొక్కదానినే సూట్ అవుతానని సంచలనంగా మాట్లాడింది. మరి కంగనా అమ్మ లుక్ లో బాగోలేదనేది నిత్యా మాటలకు అర్ధం. మరి కంగనా పేరు ప్రస్తావించనప్పటికీ... నిత్యా చేసిన వ్యాఖ్యలకు కంగనా ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కంగనా ఏ విషయాన్ని అంత తేలికగా వదిలే రకం కాదు. 

Nithya Menen Sensational Comments on Kangana Ranaut:

Nithya Menen Targets Kangana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ