Advertisementt

ఈ నాన్చుడేంటి నాగబాబూ.. పాయింట్‌కు రా!

Fri 29th Nov 2019 08:52 AM
naga babu,nagababu quits jabardasth,jabardasth show,my channel naa istam,mallemala   ఈ నాన్చుడేంటి నాగబాబూ.. పాయింట్‌కు రా!
Why Nagababu Doing These Type Of Videos..! ఈ నాన్చుడేంటి నాగబాబూ.. పాయింట్‌కు రా!
Advertisement
Ads by CJ

అనతి కాలంలోనే టాప్ కామెడీ షో ఎదిగి మంచి ఆదరణ పొందిన షో జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు బయటికొచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ షో ఏ మేరకు నడుస్తుందా..? నాగబాబు స్థానాన్ని భర్తీ చేసేదెవరు..? వచ్చిన వాళ్లు ఏ మేరకు రాణిస్తారో..? అసలు షో ఉంటుందా..? ఎత్తేస్తారా..? అనే పరిస్థితులు నెలకొన్నాయ్. షోకు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది..? నిజంగానే యాజమాన్యంతో నవ్వుల నవాబు నాగబాబుకు గొడవలొచ్చాయా..? అనే విషయాలను ఒక్కొక్కటిగా నాగబాబు తన చానెల్‌ ‘మై చానెల్ నా ఇష్టం’ వేదికగా చెప్పుకుంటూ వస్తున్నాడు. 

ఇప్పటికే కేవలం జబర్దరస్త్‌కు సంబంధించినవే మూడు వీడియోలను రిలీజ్ చేశాడు. అయితే ఈ వీడియోల్లో ఒక్కొక్కటి రెండు, మూడు మిలియన్స్ వ్యూస్‌ను సంపాదించిపెట్టాయి. మరోవైపు పెద్ద ఎత్తున కామెంట్స్ వర్షం కూడా కురిసింది. అయితే వీటిలో నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయ్.. పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయ్.. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం అసందర్భం. ఇప్పటి వరకూ విడుదల చేసిన వీడియోల్లో అసలు విషయం చెప్పకపోవడం.. ? అసలెందుకు బయటికి రావాల్సి వచ్చింది..? ఎక్కడ చెడింది..? ఎందుకు గొడవలొచ్చాయ్..? అనే విషయాలు చెప్పకుండానే అస్తమానూ నాన్చుతూ తదుపరి వీడియోలో అసలు విషయం చెబుతాను.. అదీ ఇదీ అంటూ ఇదేదో సీరియల్‌లో రోజువారి ఎపిసోడ్స్‌లాగా సస్పెన్స్ పెడుతూనే పోతున్నాడు బాబు.

మొత్తానికి చూస్తే ఆయనంతకు ఆయనే బయటికొచ్చాడా..? బయటికి పంపించారా..? బయటికి వచ్చేంత కారణాలేమున్నాయ్..? అనే విషయాలు.. నాగబాబుకు ఆ యాజమాన్యానికే ఎరుక. ఇక అవన్నీ పక్కనెడితే ఇలా అస్తమానూ వీడియోలు చేస్తూ సస్పెన్స్ పెడుతూ దీన్ని కూడా కమర్షియల్‌గా వ్యూస్ వాడుకోవడం ఎంతవరకు సమంజసం నాగబాబూ.. అంటూ నెటిజన్లు, జబర్దస్త్ ప్రియులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో ఎన్నికల టైమ్‌లో కూడా అటు టీడీపీకి.. ఇటు వైసీపీకి సంబంధించిన వీడియోలు చేసి కాసులు గట్టిగానే సంపాదించుకున్నావ్.. ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ వీడియోలతో వ్యూస్ సంపాదించుకోవడానికే ఈ ప్రయత్నాలు అని నెటిజన్లు, విమర్శకులు మండిపడుతున్నారు. మరి ఇకనైన నాగబాబు ఈ నాన్చుడు ఆపి పాయింట్ వస్తాడో..? ఇంకా ఈ సీరియల్స్‌ను సాగదీసుకుంటూ పోతాడో వేచి చూడాల్సిందే.

 

Why Nagababu Doing These Type Of Videos..!:

Why Nagababu Doing These Type Of Videos..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ