బ్రహ్మాజీ.. టాలీవుడ్ సినీ ప్రియులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఈయన హీరోగా మొదలుకుని కమెడియన్, విలన్, తండ్రిగా ఇలా అన్ని పాత్రల్లో నటించేశాడు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలకు బ్రహ్మాజీ అయితే సరిగ్గా సెట్ అవుతారనే రీతిలో పరిస్థితులుండేవి. అయితే తాజాగా ఆయన ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు..?. తన కుమారుడు సంజయ్ వివాహాన్ని గోప్యంగా గోవాలో జరిపించేశాడు.
భోపాల్‌కు చెందిన ప్రమోద్ వర్మ, పూనమ్‌ల ముద్దుల కుమార్తె అనుకృతీ దీక్షిత్‌తో ఇటీవలే బ్రహ్మాజీ కొడుకు సంజయ్ పెళ్లి జరిగింది. ఇటీవలే జరిగిన ఈ వివాహ వేడుకకు గోవా వేదికైంది. అయితే ఈ పెళ్లి మాత్రం బ్రహ్మాజీ తన అత్యంత సన్నిహితులు, కుటుంబీకులు.. మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మధ్యే జరిగినట్లు సమాచారం. అయితే లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజీ కావడంతో పెద్దగా హడావుడి ఏమీ లేకుండా సైలెంట్‌గానే పనికానిచ్చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పెళ్లి అక్కడ గోప్యంగా జరిపించినా.. రిసెప్షన్ మాత్రం త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, రాజకీయ నేతల మధ్య హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో జరిపించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.
కాగా.. బ్రహ్మాజీ తన కుమారుడ్ని కూడా తెలుగు ఇండస్ట్రీకి వారసుడిగా పరిచయం చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉండగా.. త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే సీక్రెట్ పెళ్లి జరిపించడంపై మాత్రం నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలనూ పంచుకునే బ్రహ్మాజీ కొడుకు పెళ్లిపై ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే మరి.