Advertisementt

‘ఎర్ర‌చీర‌’లో అదిరిపోయే రొమాంటిక్ సాంగ్

Thu 05th Dec 2019 08:48 PM
erra cheera movie,romantic song,ch suman babu,erra cheera telugu movie  ‘ఎర్ర‌చీర‌’లో అదిరిపోయే రొమాంటిక్ సాంగ్
Erra Cheera Movie Romantic Song Released ‘ఎర్ర‌చీర‌’లో అదిరిపోయే రొమాంటిక్ సాంగ్
Advertisement
Ads by CJ

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో న‌ట‌కిరీటి డా.రాజేంద్రప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. మ‌హాన‌టి ఫేం బేబి సాయి తేజ‌స్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజ‌నా శెట్టి, కమల్‌ కామరాజు, శ్రీరామ్, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. శివ శివ శంభో శంక‌ర అనే పాటకు ఇంత‌కుముందు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తొలి తొలి ముద్దు.. ముద్దు పైన 150 ముద్దులు..’ పాట‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. సినిమాలో రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ పాట‌కు కె.స‌త్య‌సుమ‌న్ బాబు లిరిక్ అందించ‌గా అంజ‌నా సౌమ్య‌- హేమ‌చంద‌ర్ పాడారు.

దర్శక నిర్మాత మాట్లాడుతూ.. ‘‘కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది. కుటుంబ కథే అయినా.. హారర్‌ థ్రిల్లింగ్‌ అంశాల్ని కూడా మేళవించాం. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రమోద్‌ స్వరాలు ప్రధాన బలం. రాజ‌మండ్రి రైలెక్కి...  శివ శివ శంభో శంక‌ర పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా తొలి తొలి ముద్దు పాట శ్రోత‌ల్లోకి అంతే వైర‌ల్ గా దూసుకెళుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ లిరిక్ యువ‌త‌రాన్ని హ‌త్తుకునే రొమాంటిక్ ప‌ద‌జాలంతో ఆక‌ట్టుకుంటుంది. బాణీ అద్భుతంగా కుదిరింది. హేమ‌చంద‌ర్- సౌమ్య గానం ఆక‌ట్టుకుంటుంది’’ అని తెలిపారు. 

ఈ చిత్రానికి సంగీతం: ప‌్ర‌మోద్, కెమెరా: చ‌ందు, ఎడిటింగ్: డి.వెంక‌ట్ ప్ర‌భు, ఫైట్స్: న‌ందు, స‌మ‌ర్ప‌ణ‌: బేబి ఢ‌మరి, బ్యాన‌ర్: సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్, ద‌ర్శ‌క‌నిర్మాత‌: సి.హెచ్ సుమ‌న్ బాబు.  

Erra Cheera Movie Romantic Song Released:

Erra Cheera Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ